Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీ స్టార్ ప్లేయర్‌కు బిగ్ షాక్!

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న వేళ ఆర్సీబీ జట్టుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆర్సీబీ యువ ఆల్‌రౌండర్, ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్‌ను ఐపీఎల్ క్యాంప్ వీడి వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ గట్టిగా సూచించారు. మిగిలిన మ్యాచ్‌ల్లో జాకబ్ బెథెల్‌కు ఆడే తుది జట్టులో మొదటి ప్రాధాన్యత లేనప్పుడు ఇక్కడ బెంచ్‌కే పరిమితం కావడం కంటే ఇంగ్లాండ్‌కు వెళ్లిపోవడం ఉత్తమమని మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. అంతకు ముందు మాజీ క్రికెటర్ అలిస్టర్ కుక్ కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తూ.. జాకబ్ బెథెల్ స్వదేశానికి వెళ్లి టెస్ట్ క్రికెట్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో జాకబ్ బెథెల్ కు ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. టాస్ సమయంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. జాకబ్ బెథెల్ వేలి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని.. అతని స్థానంలో తానే జట్టులోకి తిరిగి వచ్చినట్లు ప్రకటించాడు. ఈ గాయం వార్త బయటకు వచ్చిన నేపథ్యంలోనే మైఖేల్ వాన్ ఈ కామెంట్స్ చేశాడు. మైఖేల్ వాన్ మాట్లాడుతూ.. "జాకబ్ బెథెల్‌కు నిజంగానే గాయమై ఉంటే.. అతను తదుపరి విమానంలోనే ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లిపోవాలి. జూన్ 4 నుంచి ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో జరిగే ఈ టెస్ట్ సిరీస్‌కు జాకబ్ బెథెల్ ఫిట్‌గా ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ అతన్ని పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి జాకబ్ బెథెల్ యూకే చేరుకుని అక్కడి వైద్య బృందంతో పరీక్షలు చేయించుకోవడం మంచిది" అని మైఖేల్ వాన్ అన్నాడు. ఒకవేళ జాకబ్ బెథెల్ ఆర్సీబీ తరపున ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకపోతే.. వచ్చే వారం ఇంగ్లాండ్ నిర్వహించబోయే శిక్షణా శిబిరానికి అతను అందుబాటులో ఉండాలని మైఖేల్ వాన్ స్పష్టం చేశాడు.

Go Back to England Michael Vaughan Explosive Verdict on RCB Star Jacob Bethell Full Details

ఐపీఎల్ ఆడటం వల్ల యువ ఆటగాళ్ల నైపుణ్యాలు ఎంతో మెరుగవుతాయని తాను నమ్ముతానని.. అయితే గాయం కారణంగా ఆడనప్పడు అక్కడ ఉండటం అనవసరమని మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ కోచ్ మెకల్లమ్ ఆదివారం ఉదయమే యూకే చేరుకుంటున్నారని.. సోమవారం నుంచి ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభం కానుందని గుర్తుచేశారు. అయితే ఈ చర్చలో పాల్గొన్న భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందిస్తూ.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్తున్న తరుణంలో, మధ్యలోనే వెళ్లిపోతే డబ్బులు కట్ అవుతాయని, అందుకే బెథెల్ వెళ్లడానికి ఇష్టపడకపోవచ్చని పేర్కొన్నారు. దానికి మైఖేల్ వాన్ బదులిస్తూ.. "అతను ఇప్పటికే ఇక్కడ తగినంత సమయం గడిపాడు, ఒక్క వారం మిస్ అయితే వచ్చే నష్టమేమీ లేదు" అని చమత్కరించాడు.

Story first published: Saturday, May 23, 2026, 10:54 [IST]
Other articles published on May 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+