For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేనింకా క్రీజులోనే ఉన్నా.. వెళ్లి మళ్లీ బౌలింగ్ చేయ్‌: మెక్‌గ్రాత్‌కు సచిన్ పంచ్!!

Go back and bowl again as I’m still here, Sachin Tendulkar countered Glenn McGrath

ముంబై: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లను అభిమానులు ఎంత ఉద్వేగంతో చూస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ ఆటలో బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్‌కు మధ్య జరిగే సన్నివేశాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. తన బౌలింగ్‌లో పరుగులు తీయడానికి ఇబ్బంది పడే బ్యాట్స్‌మెన్‌ను చూస్తూ గేలి చేయడం ఆసీస్ బౌలర్‌ నైజమైతే.. అదే బౌలర్‌ మళ్లీ బౌలింగ్‌ను వచ్చినప్పుడు బౌండరీలు బాది ధీటుగా జవాబివ్వడం భారత బ్యాట్స్‌మన్‌కు అలవాటు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, ఆసీస్‌ దిగ్గజ పేసర్ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌లు ఈ కోవకు చెందినవారే.

మెక్‌గ్రాత్‌, సచిన్‌లపై దృష్టి:

మెక్‌గ్రాత్‌, సచిన్‌లపై దృష్టి:

90వ దశకం నుంచి 2003 సంవత్సరం వరకు తీసుకుంటే.. మెక్‌గ్రాత్‌, సచిన్ ఎదురుపడినప్పుల్లా మ్యాచ్‌ సంగతి పక్కన పెట్టి అభిమానులు వీరిపై దృష్టి సారించేవారు. 1999 టెస్టు సిరీస్‌, కెన్యాలో జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోపీ, 2003 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లనే ఇందుకు ఓ ఉదాహరణ. తాజాగా సచిన్‌.. మెక్‌గ్రాత్‌తో జరిగిన ఒక సంఘటనను ఒక వీడియో చాట్‌లో పేర్కొన్నాడు. 1999లో టీమిండియా ఆసీసీలో పర్యటించింది. అడిలైడ్‌ టెస్టు సందర్భంగా మెక్‌గ్రాత్‌ తనను ఎంతగా విసుగు తెప్పించాడనేది సచిన్‌ గుర్తు చేశాడు.

తెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు:

తెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు:

'1999 ఏడాదిలో ఆసీసీతో అడిలైడ్‌లో మొదటి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాం. మొదటి రోజు ఆట ముగియడానికి ఇంకా 40 నిమిషాలు మాత్రమే ఉంది. అప్పటికే నాకు మెక్‌గ్రాత్‌ ఐదు ఓవర్లు మెయిడిన్‌ వేసాడు. దీంతో నాకు చికాకు వేసింది. ఆసీస్‌ ఆటగాళ్లు నాకు విసుగు తెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు 70 శాతం బంతులను కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ చేతుల్లో పడాలని, 10 శాతం బంతులను మాత్రమే సచిన్‌ బ్యాట్‌కు తగిలేలా వేయాలని మెక్‌గ్రాత్‌కు వివరించారు. మెక్‌గ్రాత్‌ అదే విధంగా బౌలింగ్‌ చేస్తుంటే చాలా బంతుల్ని వదిలేశాను. అయితే మంచి బంతులను మాత్రం నా స్టైల్లో ఆడాను' అని సచిన్ వీడియో చాట్‌లో చెప్పాడు.

నేనింకా క్రీజులోనే ఉన్నా

నేనింకా క్రీజులోనే ఉన్నా

'మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత మెక్‌గ్రాత్‌ను ఉద్దేశించి మాట్లాడా. బాగానే బౌలింగ్ చేశావు, కానీ ఇప్పుడు వెళ్లి మళ్లీ బౌలింగ్‌ చేయ్‌.. ఎందుకంటే నేనింకా క్రీజులోనే ఉన్నా అంటూ కౌంటర్‌ ఇచ్చా. తర్వాతి రోజు బ్యాటింగ్‌ దిగినప్పుడు మెక్‌గ్రాత్‌ బౌలింగ్‌లో కొన్ని బౌండరీలు సాధించినా.. కొన్ని బంతులు మాత్రం బాగానే ఇబ్బంది పెట్టాయి. ఎందుకంటే తర్వాతి రోజు ఇద్దరం సమాన స్థాయిలో ఉన్నాం. కానీ వాళ్లు మాత్రం నన్ను విసిగించే పనినే టార్గెట్‌గా పెట్టుకున్నారు' అని సచిన్‌ తెలిపాడు.

క్రికెట్‌కే వన్నె తెచ్చిన సచిన్

క్రికెట్‌కే వన్నె తెచ్చిన సచిన్

24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ క్రికెట్‌కే వన్నె తెచ్చాడు. 16 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికై తన బ్యాటింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. క్రికెటంతా ఒక చరిత్ర అయితే, తనే ఓ చరిత్రగా మిగిలిపోయాడు. యావత్‌ క్రీడాభిమానులంతా సచిన్‌ను దేవుడిగా చూస్తారు. 16 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికైన సచిన్.. పాకిస్థాన్‌ మీద అరంగేట్రం చేశాడు. తన పరుగుల వేటతో ఆస్ట్రేలియా ఆల్‌టైమ్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ డాన్‌బ్రాడ్‌మన్‌తో అభిమానులు తనని పోల్చుకునేలా ఎదిగాడు.

కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు:

కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు:

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచాడు. లిటిల్ మాస్టర్ తన కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు చేశారు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ బాదాడు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించాడు. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై 147 బంతుల్లో 200 పరుగులు పూర్తిచేశాడు. క్రి2012 మార్చి 16న శతకం బాది.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌ ఆడిన క్రికెటర్‌గా కూడా సచిన్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టెస్టుల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఒకేఒక్క ఆటగాడు మాస్టర్‌ బ్లాస్టర్ కావడం విశేషం. 2012 డిసెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్.. 2013 అక్టోబర్‌లో టీ20లకు, 2013 నవంబర్‌ 13న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Wednesday, April 29, 2020, 13:43 [IST]
Other articles published on Apr 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+