గ్లోబల్ టీ20 కెనడా లీగ్.. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన యువరాజ్

కెనడా : అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ 'గ్లోబల్ టీ20 కెనడా' లీగ్‌లో ఆడతున్నాడు. ఈ టీ20 లీగ్ రెండవ సీజన్ కెనడాలోని బ్రాంప్టన్‌లో గురువారం ప్రారంభం అయింది. ఆగస్టు 11 వరకు లీగ్ జరుగుతుంది. టొరంటో నేషనల్స్ జట్టు తరపున యువీ బరిలోకి దిగి నిరాశపరిచాడు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
టోరంటో తరఫున యువరాజ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 27 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి స్టంపౌట్‌గా అయ్యాడు. దీంతో రిటైరైన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. యువరాజ్ కెప్టెన్‌గా వ్యవహిస్తున్న టోరంటో జట్టులో బ్రెండెన్ మెక్‌కల్లమ్ (4), కీరన్ పొలార్డ్ (30) పరుగులు చేశారు. మెక్‌కల్లమ్, యువరాజ్ విఫలమయినా.. క్లాసేన్ (41), పొలార్డ్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 159 పరుగులు చేసింది.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాంకోవర్ నైట్స్ 17.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వాంకోవర్ కెప్టెన్ క్రిస్ గేల్ (12) నిరాశపరిచినా.. వాల్టన్ (59), దూసేన్ (65) అర్ధ సెంచరీలతో రాణించడంతో సునాయాస విజయం అందుకుంది. టోరంటో జట్టులో బౌలర్లు కూడా పూర్తిగా విగలమయ్యారు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్ కారణంగా క్రిస్ గేల్ టీమిండియా పర్యటనకు దూరంగా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications