Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టేడియంలోని అద్దాలను పగలగొట్టిన షోయబ్ మాలిక్ (వీడియో)

Global T20 Canada: Shoaib Malik shatters glass window with huge sixes

హైదరాబాద్: టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్‌ మాలిక్‌ స్టేడియంలోని అద్దాలను పగలగొట్టాడు. ప్రస్తుతం గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతోన్న షోయబ్ మాలిక్ తన భారీ సిక్సులతో ఏకంగా రెండు సార్లు స్టేడియంలోని అద్దాలను పగలగొట్టడం విశేషం.

లీగ్‌లో భాగంగా గురువారం వాంకోవర్ నైట్స్, బ్రాంప్టన్‌ వోల్‌వ్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వాంకోవర్‌ నైట్స్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న షోయబ్ మాలిక్‌ బౌండరీ వెలుపలికి బాదిన రెండు బంతులు నేరుగా రెండు కిటికీల అద్దాలకు తగలడంతో అవి ధ్వంసమయ్యాయి.

ఈ మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా రసెల్‌(43), టీపీ వైసీ(40) విజృంభించడంతో వాంకోవర్‌ నైట్స్‌ 16 ఓవర్లలో 170 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదిరించారు.

లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రాంప్టన్‌ జట్టు 13.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ మున్రో ఒక్కడే హాఫ్ సెంచరీ(62)తో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారంతా రెండంకెల స్కోరు చేయలేకపోవడంతో 77 పరుగులతో బ్రాంప్టన్‌ వోల్‌వ్స్‌ ఓడిపోయింది. ఈ విజయంతో వాంకోవర్‌ నైట్స్‌ నాకౌట్‌లో అడుగుపెట్టింది.

సంక్షిప్త స్కోర్లు:
వాంకోవర్ నైట్స్ 170-4
బ్రాంప్టన్‌ వోల్‌వ్స్‌ 103-ఆలౌట్
డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో వాంకోవర్ నైట్స్ 77 పరుగులతో విజయం సాధించింది.

Story first published: Saturday, August 10, 2019, 8:45 [IST]
Other articles published on Aug 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+