టీ20 చరిత్రలోనే అద్భుతం: 85 పరుగులకే ఆలౌట్.. అయినా ట్రోఫీ గెలిచిన జట్టు!
టీ20 క్రికెట్లో 85 పరుగులు అనేది సాధారణంగా ఓటమికి కేరాఫ్ అడ్రస్‌గా పరిగణించబడుతుంది. కానీ గ్లోబల్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మాత్రం క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన, ఊహించని పరిణామానికి వేదికైంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ తుదిపోరులో గయానా అమెజాన్ వారియర్స్ జట్టు కేవలం 85 పరుగులకే ఆలౌట్ అయినప్పటికీ.. ప్రత్యర్థి శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టును 79 పరుగులకే కట్టడి చేసి 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. టీ20 చరిత్రలోనే ఫైనల్లో విజయవంతంగా కాపాడుతున్న అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం.
కుప్పకూలిన గయానా బ్యాటింగ్
ముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన గయానా అమెజాన్ వారియర్స్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. కేవలం 9 ఓవర్లలోనే 29 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వెస్టిండీస్ స్టార్ ప్లేయర్లు జాన్సన్ చార్లెస్, షిమ్రాన్ హెట్మెయర్, ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్, ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ వంటి ప్రముఖులందరూ దారుణంగా విఫలమయ్యారు. కనీసం 50 పరుగులు కూడా చేయడం కష్టం అనిపించిన స్టేజ్‌లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు జట్టును ఆదుకున్నారు. లోయరార్డర్ బ్యాటర్లు డ్వైన్ ప్రిటోరియస్(17 నాటౌట్), మాథ్యూ ఫోర్డ్(28), కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్(11) బాధ్యతాయుతంగా ఆడి విలువైన పరుగులు జోడించారు. దీంతో గయానా జట్టు 85 పరుగుల స్కోరును చేయగలిగింది.

శాన్‌ఫ్రాన్సిస్కో జట్టు తరఫున ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ పీటర్ సిడిల్ అద్భుతమైన బౌలింగ్ చేసి పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చాడు. పీటర్ సిడిల్ తన 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పీటర్ సిడిల్ అతని కచ్చితమైన లైన్, లెంగ్త్, బౌలింగ్ మూవ్‌మెంట్ గయానా టాప్ ఆర్డర్‌ను పూర్తిగా చిన్నాభిన్నం చేశాయి. బంతితో తన అద్భుత ప్రదర్శన తర్వాత ఆయన బ్యాటింగ్‌లో కూడా అజేయంగా 13 పరుగులు చేసి, చివరి వరకు జట్టు ఆశలను సజీవంగా ఉంచాడు. కానీ విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు.
ఉత్కంఠభరితంగా సాగిన లక్ష్యఛేదన
కేవలం 86 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టు సులభంగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ గయానా బౌలర్లు మ్యాచ్ ను పూర్తిగా తమ వైపు తిప్పుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే టిమ్ రాబిన్సన్ ఔట్ కావడంతో వికెట్ల పతనం ప్రారంభమైంది. ఒక దశలో 53/3తో పటిష్టంగా ఉన్న ఆ జట్టు అనూహ్యంగా 58/8కి కుప్పకూలింది. యువ బ్యాటర్ ఆలివర్ పీక్(31 పరుగులు) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. చివరకు క్యాలమ్ స్టోవ్ పరుగు తీయబోయి రనౌట్ కావడంతో శాన్‌ఫ్రాన్సిస్కో ఇన్నింగ్స్ ముగిసింది.
ఈ అద్భుత విజయానికి గయానా కెప్టెన్ 47 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ప్రధానంగా నిలిచాడు. అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన ఇమ్రాన్ తాహిర్.. బౌలింగ్ లో 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు బ్యాటింగ్ లోనూ 11 పరుగులు చేసి చివరి వికెట్ కు 15 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరికి ఈ పరుగులే గెలుపు ఓటముల మధ్య తేడాను నిర్ణయించాయి. మైదానంలో గయానా ఆటగాళ్ల సంబరాలు చూడముచ్చటగా ఉన్నాయి. కామెంటేటర్ డానీ మోరిసన్ కూడా ఆశ్చర్యపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

