Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Glenn Phillips: టెస్టును టీ20 అనుకుని బంగ్లాదేశ్‌ను ఉతికేసి.. చివరికీ

ఢాకా వేదికగా బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. బౌలింగ్ కు అనుకూలించే ఢాకా పిచ్ పై తొలి రోజు ఆటలోనే 15 వికెట్లు పడ్డాయి. బంగ్లాదేశ్ 172 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ మొదటి రోజు ఆట ముగిసేసరికి 55 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇక రెండో రోజు ఆట రద్దు కాగా, మూడో రోజు ఆట మొదట్లోనూ బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. 97 పరుగులకే కివీస్ ఏడు వికెట్లు పడగొట్టింది. అయితే ఆ తర్వాత న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ టీ20 ఆడుతున్నట్లుగా బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇరు జట్లు బ్యాటర్లు సింగిల్ తీయడానికి కూడా కష్టపడిన ఆ పిచ్ పై బౌండరీలతో హోరెత్తించాడు.

 Glenn Phillips thought the test was a T20 and washed away Bangladesh

ఫిలిప్స్ 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. తొమ్మిది బౌండరీలు, నాలుగు సిక్సర్లు బాదాడు. దాంతో అప్పటివరకు ఆధిపత్యం చెలాయించిన బంగ్లా బౌలర్లు ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా ఉండిపోయారు. ఫిలిప్స్ ధాటికి మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అయితే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న అతడిని షోరిఫుల్ ఔట్ చేశాడు. ఫిలిప్స్ 72 బంతుల్లో 87 పరుగులు చేయడం విశేషం. 180 పరుగుల వద్ద ఫిలిప్స్ తొమ్మిదో వికెట్ గా వెనుదిరగగా న్యూజిలాండ్ 180 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించిన బంగ్లాదేశ్ మూడో రోజు ఆట ముగిసేసరికి 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో బంతికే హసన్ జాయ్ (2)ను అజాజ్ పటేల్ ఔట్ చేశాడు. కాసేపటికి సౌథి బౌలింగ్ లో నజ్ముల్ (15) ఔటయ్యాడు. మూడో రోజు ఆట సుమారు 32 ఓవర్లే జరిగాయి. వెట్ అవుట్ ఫీల్డ్ కారణంగా ఫస్ట్ సెషన్ రద్దు కాగా, బ్యాడ్ లైట్ కారణంగా మూడో సెషన్ పూర్తిగా కొనసాగలేదు.

Story first published: Friday, December 8, 2023, 16:16 [IST]
Other articles published on Dec 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+