
హైదరాబాద్: ఓవల్ వేదికగా భారత్‌తో జరిగిన ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన పేస్ బౌలర్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డుని బద్దలు కొట్టాడు.
భారత్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో మహమ్మద్ షమీ వికెట్ తీయడం ద్వారా మెక్‌గ్రాత్(563)ను అధిగమిస్తూ అండర్సన్ ఈ రికార్డు అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో 564 వికెట్లతో జేమ్స్ అండర్సన్ నాలుగో స్థానంలో నిలిచాడు.
టెస్టుల్లో 143 మ్యాచ్‌ల్లో ఆండర్సన్ ఇప్పటి వరకు 564 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత మెక్‌గ్రాత్ 124 మ్యాచ్‌ల్లో 563 వికెట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. వాల్ష్(132స్థానాల్లో) 519 వికెట్లు, కపిల్ దేవ్(131మ్యాచ్‌లు) 434 వికెట్లు, స్టువర్ట్ బ్రాడ్(123మ్యాచ్‌లు) 433 వికెట్లు తీసి తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఈ జాబితాలో శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్(800), ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్(708), భారత్‌కు చెందిన అనిల్ కుంబ్లే (619) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. తన రికార్డుని అధిగమించడంపై బీబీసీ రేడియో 5 లైవ్‌లో మెక్ గ్రాత్ మాట్లాడుతూ ఆండర్సన్‌కు 600 వికెట్లు తీసే సత్తా ఉందని అన్నాడు.
"ప్రస్తుతం జిమ్మీ అద్భుత ఫిట్‌నెస్‌తో గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. సుదీర్ఘ కాలంగా టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అతడు నా రికార్డును అధిగమించాడు. 140 టెస్టులకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రతిరోజు మెరగవుతున్నాడు. అతడి ప్రదర్శన పట్ల ఎంతో సంతృప్తిగా ఉంది" అని మెక్ గ్రాత్ అన్నాడు.
"అతడిని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. అతడి తదుపరి టార్గెట్ టెస్టుల్లో 600 వికెట్లు తీయడమే. ప్రస్తుత తరంలో అది అతనికే సాధ్యం. ఒకవేళ అతడు 600 మైలురాయిని దాటితే అది గొప్ప ఘనతే. ఇదే ఫామ్‌ను కొనసాగించి మరిన్ని వికెట్లు తీయాలని నేను కోరుకుంటున్నా. అతడు గట్టిగా ప్రయత్నిస్తే టాప్-3లో ఉన్న ఒక స్పిన్నర్ రికార్డును అతడు అందుకోగలడు. అది కుంబ్లే(619)ను చేరుకోవడమే" అని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు.
{document1}