Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2019 వరల్డ్ కప్‌‌లో నా ఫేవరేట్ జట్టు అదే: మెక్‌గ్రాత్

Glenn McGrath believes England are favourites for ICC Cricket World Cup 2019

హైదరాబాద్: 2019లో జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ జట్టు ఫేవరేట్‌గా ఉందని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ వ్యాఖ్యానించాడు. డైలీ మెయిల్ పత్రికకు రాసిన కాలమ్‌లో ఈ మధ్య కాలంలో ఇంగ్లాండ్‌ వన్డే క్రికెట్‌ను చూసిన తర్వాతే తాను ఆ జట్టును టైటిల్‌ ఫేవరెట్‌గా చెబుతున్నానని అన్నాడు.

'గత రెండు సంవత్సరాలుగా వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లాండ్‌ తన జైత్రయాత్ర కొనసాగుతోంది. 22 అంతర్జాతీయ వన్డేలకు గాను 19 విజయాలను సొంతం చేసుకుంది. ఇదే తరహా ఆటను కొనసాగిస్తే మాత్రం ఇంగ్లాండ్‌ను ఎవరూ ఆపలేరు. అందులోనూ సొంతగడ్డపై జరిగే వరల్డ్‌ కప్‌ కావడంతో ఇంగ్లాండ్‌ను ఓడించడం చాలా కష్టం' అని మెక్‌గ్రాత్‌ అభిప్రాయపడ్డాడు.

'జట్టు సాధిస్తున్న విజయాలను చూస్తుంటే మంచి అభిప్రాయం కలుగుతోంది. కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ చక్కటి బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండటంతో పాటు స్వేచ్ఛగా ఆడేందుకు ఆటగాళ్లుకు అవకాశం ఉంది. 50 ఓవర్ల క్రికెట్‌లో ఓ జట్టుకు ఉండాల్సిన దృక్పథం అదే' అని మెక్‌గ్రాత్ అన్నాడు.

ఇక, ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌పై మెక్ గ్రాత్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. గేమ్ ప్లాన్స్ కూడా బాగా తెలుసు. నాలుగో స్థానానికి జో రూట్ చక్కగా సరిపోయాడు. టాపార్డర్ బ్యాట్స్‌మన్ లాగా ఆడటంతో పాటు భారీ స్కోర్లు చేసే దిశగా జట్టుని నడిపించడగలడు. ఒత్తిడిని అధిగమించి ఆడటంలో అతడికి అతడే సాటి' అని చెప్పాడు.

కాగా, క్రికెట్‌‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్‌ ఇప్పటివరకూ ఒక్క వన్డే వరల్డ్‌ కప్‌ను కూడా అందుకోలేకపోయింది. ఈ మెగా టైటిల్‌ కోసం 11 సార్లు టోర్నీలు జరగ్గా, మూడుసార్లు ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్‌ 1979,1987, 1992 సంవత్సరాల్లో రన్నరప్‌గానే మిగిలిపోయింది. 2019లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఇంగ్లాండ్‌లో జరగడంతో ఆ జట్టుకు కలిసిరానుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 5, 2018, 15:22 [IST]
Other articles published on Feb 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+