Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Maxwell: తప్పతాగి ఆస్పత్రి పాలైన మాక్సీ.. జట్టు నుంచి తప్పించిన ఆసీస్!

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ వివాదంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. మాక్సీ ఇటీవల తప్పతాగి సోయి లేకుండా పడిపోయాడు. అనంతరం అంబులెన్స్‌లో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అయిన 'క్రికెట్ ఆస్ట్రేలియా' (CA) ఫుల్‌గా సీరియస్ అయ్యింది. మాక్స్‌వెల్‌కు అసలేం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడం కోసం దర్యాప్తుకు ఆదేశాలు జారీచేసింది.

జనవరి 19న రాత్రి అడిలైడ్‌లో 'సిక్స్ అండ్ అవుట్' బ్యాండ్‌తో కలిసి మాక్స్‌వెల్ పార్టీ చేసుకున్నాడు. ఫుల్‌గా మందు కొట్టాడు. ఆ బ్యాండ్‌లో ఆస్ట్రేలియా మాజీ పేస‌ర్ బ్రెట్ లీ స‌భ్యుడిగా ఉన్నాడు. అయితే ఈ క్రమంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మాక్స్‌వెల్‌ను పక్కనపెట్టింది. టీ20ల సిరీస్ కోసం మాక్సీకి విశ్రాంతి ఇస్తున్నట్లు తెలిపింది. కానీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతడిపై వేట పడినట్లు తెలుస్తోంది.

Glenn Maxwell was admitted to the hospital after drinking alcohol

అయితే వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో మాక్స్‌వెల్‌‌కు అవకాశం కల్పిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ''అడిలైడ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌కు సంబంధించిన సంఘటన బోర్డు దృష్టిలోకి వచ్చింది. దానిపై పూర్తి సమాచారాన్ని కోరుతోంది. అయితే దాని గురించి వన్డే జట్టులో మాక్సీని పక్కన పెట్టలేదు. బిగ్ బాష్ లీగ్‌తో పాటు అతడు పని ఒత్తిడి గురించి ఆలోచిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. మాక్స్‌వెల్ టీ20 సిరీస్‌లోకి అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నాం'' అని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.

బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు మాక్స్‌వెల్ కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆ జట్టును సెమీఫైనల్స్‌కు చేర్చలేకపోయాడు. కాగా, వెస్టిండీస్‌తో మూడు వన్డేల‌ సిరీస్‌కు 13 మందితో కూడిన‌ జట్టు‌ను ఆస్ట్రేలియా ఇవాళ ప్ర‌క‌టించింది. కెప్టెన్ క‌మిన్స్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో సారథి బాధ్యతలు స్టీవ్ స్మిత్‌ అందుకున్నాడు. కాగా, ఫిబ్రవరి 2న తొలి వన్డే జరగనుంది.

ఆస్ట్రేలియా వన్డే జట్టు: స్టీవ్ స్మిత్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, జేక్ ఫ్రేజర్, లాన్స్ మోరిస్, జేవియర్ బార్ట్‌లెట్, మ్యాట్ షార్ట్, ఆడమ్ జంపా

Story first published: Monday, January 22, 2024, 19:29 [IST]
Other articles published on Jan 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+