న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Glenn Maxwell: 'సోషల్ మీడియాలో చెత్తవాగుడు వాగకండి.. నా సహచరులను ఏమన్నా అంటే ఊరుకునేది లేదు'

Glenn Maxwell Warns Fans Who Are Abusing With Bad Comments On Social Media For RCB Players
IPL 2021 : Glenn Maxwell Slams Social Media Trolls After RCB’s Loss || Oneindia Telugu

షార్జా: ఐపీఎల్ 2021లో భాగంగా షార్జాలో సోమవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. సునీల్ నరైన్‌ (4/21) అద్భుత బౌలింగ్‌ కారణంగా మొదట బెంగళూరు 7 వికెట్లకు 138 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ (39; 33 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌. శుభ్‌మన్‌ గిల్‌ (29; 18 బంతుల్లో 4×4), వెంకటేశ్‌ అయ్యర్‌ (26; 30 బంతుల్లో 1×6), సునీల్‌ నరైన్‌ (26; 15 బంతుల్లో 3×6) రాణించడంతో స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా మరో రెండు బంతులు మిగిలి ఉండగా 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొహ్మద్ సిరాజ్‌ (2/19), హర్షల్‌ పటేల్‌ (2/19), యుజ్వేంద్ర చహల్‌ (2/16) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండాపోయింది. ఈ ఓటమితో ఆర్‌సీబీ ఐపీఎల్ 2021 నుంచి నిష్క్రమించింది.

RCB vs KKR: ఇక ఆ అవకాశం లేకపోవడంతో.. మైదానంలోనే ఏడ్చేసిన విరాట్ కోహ్లీ! అది చూసిన ఫాన్స్(వీడియో)RCB vs KKR: ఇక ఆ అవకాశం లేకపోవడంతో.. మైదానంలోనే ఏడ్చేసిన విరాట్ కోహ్లీ! అది చూసిన ఫాన్స్(వీడియో)

సోషల్ మీడియాలో మండిపడుతున్న ఫాన్స్:

'ఈ సాలా కప్ నమ్‌దే' అంటూ టోర్నీలోకి అడుగుపెట్టడం.. ఉత్తచేతులతో వెళ్లడం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు అలవాటుగా మారింది. అయితే ఈసారి తొలి అంచెలో ఆర్‌సీబీ మెరుగైన ప్రదర్శన చేయడంతో మళ్లీ కప్పుపై ఆశలు రేగాయి. యూఏఈలో రెండో అంచె ఆరంభానికి ముందు ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే తన చివరి సీజన్‌ అని విరాట్ కోహ్లీ ప్రకటించడంతో ఈసారి కప్పు గెలిచి తీరాల్సిందే అన్న భావన అభిమానుల్లో కలిగింది. అందుకు తగ్గట్టే కోహ్లీసేన ప్లే ఆఫ్స్ కూడా చేరింది. భారీ అంచనాలతో ఎలిమినేటర్‌ మ్యాచులో బరిలోకి దిగిన ఆర్‌సీబీ.. ఎప్పట్లానే ఉసూరుమనిపించింది. దాంతో ఈసారి కూడా కప్పు గెలవకుండానే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. దాంతో సోషల్ మీడియాలో ఫాన్స్ మండిపడుతున్నారు. ఆర్‌సీబీ ఆటగాళ్లను ఓ ఆటాడుకుంటున్నారు.

చెత్త కెమెంట్స్ పోస్ట్ చేస్తున్నారు:

ఆర్‌సీబీ ఆటగాళ్లపై వచ్చే కామెంట్స్ నేపథ్యంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో చెత్త కామెంట్లు పెట్టొద్దని, తన సహచరులను ఏమన్నా అంటే ఊరుకునేది లేదన్నాడు. 'ఆర్‌సీబీకి ఇది గొప్ప సీజన్ అనే చెప్పాలి. దురదృష్టవశాత్తు మేము ఫైనల్స్ చేరుకోలేకపోయాం. అయితే అద్భుతమైన సీజన్‌కు ఏ మాత్రం తీసిపోదు. సోషల్ మీడియాలో చెత్త ఎప్పుడూ ఉంటుంది. కానీ కొందరు వారి లిమిట్స్ దాటేస్తున్నారు. చెత్తచెత్త కెమెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. కొన్ని అసహ్యంగా ఉన్నాయి. మేము మనుషులమే. ప్రతిరోజూ మా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం' అని మాక్స్‌వెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.

ఊరుకునేది లేదు:

'సోషల్ మీడియాలో దుర్వినియోగాన్ని వ్యాప్తి చేయడానికి బదులుగా మంచి వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించండి. క్రీడాకారుల పట్ల ప్రేమ మరియు ప్రశంసలను కురిపిసున్న నిజమైన అభిమానులకు ధన్యవాదాలు. అయితే సోషల్ మీడియాలో దురదృష్టవశాత్తు కొంతమంది ఆకతాయిలు కూడా ఉన్నారు. వారు సోషల్ మీడియాను భయంకరమైనదిగా మారుస్తున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు. దయచేసి మీరు వారిలా ఉండకండి. నా సహచరులను, స్నేహితులను ఎవరేమన్నా అంటే ఊరుకునేది లేదు' అని గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు బెంగళూరు ఆల్‌రౌండర్‌ డేనియల్ క్రిస్టియన్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రోజు తాను బాగా ఆడలేదని, అది ఓ గేమ్ మాత్రమే అని పేర్కొన్నాడు. తాను ఆడకుంటే.. తన ఫ్యామిలీని ట్రోల్ చేయడం సరికాదన్నాడు. దయచేసి తమ కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దని డాన్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, October 12, 2021, 10:02 [IST]
Other articles published on Oct 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X