
మ్యాక్స్‌వెల్ సాహసం:
బీబీఎల్ లీగ్‌లో భాగంగా హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లు అందరూ లాంచెస్టన్ చేరుకుని మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్టేడియం ముందు మంటలు చెలరేగాయి. ఆటగాళ్లు అందరూ కొంత ఆందోళనకు గురైనా.. మ్యాక్స్‌వెల్ మాత్రం సాహసం చేసాడు. స్టేడియం బయటకు పరుగెత్తి మంటలను ఆర్పే యంత్రంతో ఆ మంటలను అదుపు చేశాడు.
వీడియో తీసిన స్టెయిన్:
మ్యాక్స్‌వెల్ సాహసంను దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. మరోవైపు బీబీఎల్ కూడా ఈ వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు మాక్సీ చేసిన సాహసంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మెల్బోర్న్ విజయం:
ఈ ఘటన జరిగినా కూడా మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం కలగలేదు. అయితే మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా.. మొదటగా బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ జట్టు 5 వికెట్లను 69 పరుగులు చేసింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మెల్బోర్న్ టార్గెట్ 11 ఓవర్లలో 80 పరుగులు అయింది. మార్కస్ స్టొయినిస్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ మూడో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించారు.

అభిమానులకు అసలైన మజా:
బీబీఎల్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచుతోంది. లీగ్‌లో ఇప్పటికే మాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. అఫ్గాన్ స్పిన్నర్ అహ్మద్ వినూత్న సంబరాలతో అబిమానులను అలరించగా.. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో హాట్‌టాపిక్ అయ్యాడు. ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్ తన ప్రతాపం చూపించాడు. తాజాగా ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ పేలవ రీతిలో రనౌట్ అయ్యాడు. ఇవన్ని అభిమానులు ఎంజాయ్ చేశారు.


Click it and Unblock the Notifications












