INDvsAUS : ఆసీస్ అద్భుతంగా ఆడుతోంది.. ఆ గంటలో అలా జరగకుంటే మ్యాచ్ మనదే: మ్యాక్స్‌వెల్

భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆసీస్ జట్టు బాగానే ఆడుతోందని ఆ జట్టు స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ అన్నాడు. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది మాజీలు మండిపడ్డారు. ఆసీస్ బ్యాటర్లు పరమ చెత్తగా ఆడారని విమర్శించారు. అయితే ఆ మ్యాచ్‌లో ఆసీస్ అద్భుతంగా ఆడిందని, మూడో రోజు మొదటి సెషన్ వరకూ ఆధిపత్యం చెలాయించిందని మ్యాక్స్‌వెల్ అభిప్రాయపడ్డాడు.

ఆసీస్ బ్యాటింగ్ అద్భుతం..
ఆ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటింగ్ కుప్పకూలిన గంట తప్ప మిగతా మ్యాచ్ అంతా ఆసీస్ అద్భుతంగా ఆడిందని కొనియాడాడు. అసలు భారత్‌లో భారత్‌తో తలపడటం చాలా కష్టమైన పని అని, కానీ కొన్ని కొన్ని సందర్భాలు తప్ప మిగతా మ్యాచులో ఆసీస్ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాడు. ఇకపై జరిగే మ్యాచుల్లో కూడా ఆసీస్ బ్యాటర్లు కొంచెం ఓర్పు చూపిస్తే ఆస్ట్రేలియాకు చాలా మేలు జరుగుతుందని సూచించాడు. బ్యాటింగ్ కుప్పకూలిన సెషన్ తప్ప మిగతా మ్యాచులో అద్భుతంగా పోరాడారని మెచ్చుకున్నాడు.

గట్టిగా పోరాడారు..
'భారత్‌లో ఆడటం మామూలు కష్టం కాదు. ముఖ్యంగా మనకు చాలా కొత్తగా ఉంటుంది. చిన్న చిన్న మూమెంట్స్ తప్ప ఆ మ్యాచులో రాణించామనే అనుకుంటున్నా. కొన్ని సమయాల్లో భారత్‌కు చాలా గట్టి పోటీ కూడా ఇచ్చాం. మనవాళ్లు చాలా పోరాట పటిమ చూపించారు' అని మ్యాక్స్‌వెల్ కొనియాడాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మ్యాచ్‌లో ఆసీస్ ఆధిక్యంలో ఉందని, మంచి టార్గెట్ సెట్ చేసి ఉంటే భారత ఆటగాళ్లు తడబడే వాళ్లని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు నాలుగు టెస్టు సిరీసులో 2-0 ఆధిక్యం సాధించింది. మూడో టెస్టులో కూడా గెలిస్తే సిరీస్ గెలవడమే కాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా చేరుతుంది టీమిండియా.

మిగతా టెస్టులు చూడండి..
భారత్‌తో జరిగే చివరి రెండు టెస్టుల్లో కూడా ఆస్ట్రేలియా మంచి పోరాటం చూపుతుందని మ్యాక్స్‌వెల్ ఆశించాడు. 'మిగతా మ్యాచుల్లో కూడా గట్టిగా పోరాడి, కీలక సమయాల్లో ఆధిపత్యం చెలాయించడమే జట్టుకు అందే సందేశం అని నేను అనుకుంటున్నా. రెండో టెస్టులో మూడో రోజు మొదలైనప్పుడే మనమే ముందంజలో ఉన్నాం. భారత్‌లో ఆడుతూ టీమిండియాపై ఏ సమయంలో అయినా ముందంజలో ఉన్నామంటే.. మనం బాగా ఆడుతున్నట్లే లెక్క. అదే ఇంకొంత సమయం చేసి ఉంటే బాగుండేది. తర్వాతి మ్యాచ్‌లో మనవాళ్లు ఇంకా గట్టిగా పోరాడతారు చూడండి' అని ధీమా వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications