Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

145: చెలరేగిన మాక్స్‌వెల్, టీ20లో వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఆస్ట్రేలియా

పల్లెకెలె: ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో వరల్డ్ రికార్డు నమోదైంది. ఆసీస్ ఓపెనర్ గ్లెన్ మాక్స్‌వెల్ చెలరేగి ఆడటంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లకు గాను 3 వికెట్లను కోల్పోయి 263 పరుగులు సాధించింది.

ఓపెనర్ మాక్స్‌వెల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్‌లు, 223 స్ట్రయిక్ రేటుతో 145 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా టీ20లో ప్రపంచ రికార్డుని నమోదు చేసింది. ఇప్పటి వరకూ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక స్కోరు శ్రీలంకదే.

Glenn Maxwell

2007లో కెన్యాపై దక్షిణాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 20 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. 9 ఏళ్ల ఈ రికార్డుని ఇప్పుడు ఆస్ట్రేలియాతో బ్రేక్ అయింది. ప్రస్తుతం ఆసిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది.

టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఆరోన్ ఫించ్ (156 పరుగులు) ఉన్నాడు. మాక్స్‌వెల్ 145 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

Highest T20I totals (Top 5:

* 263/3 in 20 overs - Australia Vs Sri Lanka (Pallekele, 2016)
* 260/6 in 20 overs - Sri Lanka Vs Kenya (Johannesburg, 2007)
* 248/6 in 20 overs - Australia Vs England (Southampton, 2013)
* 245/6 in 20 overs - West Indies Vs India (Lauderhill, 2016)
* 244/4 in 20 overs - India Vs West Indies (Lauderhill, 2016)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+