న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఐపీఎల్‌ను అలా నిర్వహించొచ్చు.. టీ20 ప్రపంచకప్‌ మాత్రం కుదరదు'

Glenn Maxwell says IPL can be held without crowd, T20 World Cup cant

మెల్‌బోర్న్‌: మహమ్మారి కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) జరుగుతుందా? లేదా అన్నది అనుమానంగా మారింది. ఇప్పటికే లీగ్‌ను ఈనెల 14 దాకా వాయిదా వేసిన బీసీసీఐ.. తాజాగా కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో ఉండడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. అయితే ఐపీఎల్‌ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని కొందరు క్రికెటర్లు, మాజీలు అభిప్రాయపడుతున్నారు.

1200 మంది యువ వైద్యులకు సచిన్‌ సెమినార్‌!!1200 మంది యువ వైద్యులకు సచిన్‌ సెమినార్‌!!

ఐపీఎల్‌ వరకైతే ఓకే:

ఐపీఎల్‌ వరకైతే ఓకే:

అభిమానులు లేకుండా ఐపీఎల్‌ను జరిపించవచ్చు కానీ.. అలా టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించడం సాధ్యం కాదని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అన్నాడు. 'ప్రేక్షకుల లేకుండా మ్యాచ్‌లు సాగడం ఎంతో కష్టతరం. అయితే స్టేడియంలో ప్రజలు లేకుండా ఐపీఎల్‌ను నిర్వహించొచ్చు. కానీ.. అలా టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించడం నేను చూడలేను. మెగాటోర్నీకి అభిమానులు లేకుండా ఏర్పాటు చేయడం సరికాదు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వస్తే సమర్థించను. ప్రజలు శ్రేయస్సు, ఆరోగ్యం ముఖ్యం' అని మాక్స్‌వెల్‌ పేర్కొన్నాడు.

ప్రపంచకప్‌పై సందేహాలు:

ప్రపంచకప్‌పై సందేహాలు:

రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై కూడా సందేహాలు మొదలవుతున్నాయి. అయితే ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేస్తే.. అక్టోబర్‌-నవంబర్‌లో ఐపీఎల్‌ నిర్వహించాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో ఉండడంతో ఐపీఎల్ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై బీసీసీఐ చర్చలు జరుపుతోంది. అయితే, కేంద్రం నిర్ణయంపై వేచి చూస్తున్నామనీ.. ఆ తర్వాతే ఐపీఎల్‌ భవితవ్యాన్ని నిర్ణయించనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వెల్లడించాడు.

వేలంలో భారీ ధర:

వేలంలో భారీ ధర:

గతేడాది చివరలో జరిగిన ఐపీఎల్ వేలంలో మాక్స్‌వెల్‌‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.10.75 కోట్లకు కోనుగోలు చేసింది. మ్యాక్సీ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. పలు ఫ్రాంఛైజీలు అతన్ని కొనుక్కోవడానికి పోటీపడ్డాయి. చివరకు భారీ మొత్తంకు పంజాబ్ దక్కించుకుంది. మోచేతి గాయం కారణంగా గత కొద్దిరోజులుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న మాక్స్‌వెల్.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

110 వన్డేలు.. 61 టీ20లు:

110 వన్డేలు.. 61 టీ20లు:

మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుతం వన్డేలు, టీ20ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో టెస్టులు కూడా ఆడాడు. ఇప్పటివరకు 110 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్‌ 2,877 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 61 టీ20లు ఆడి 1,576 పరుగులు చేసాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Monday, April 13, 2020, 8:29 [IST]
Other articles published on Apr 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X