
భారత సంతతి వ్యక్తులు దొరకలేదా:
వినీ రామన్ షేర్ చేసిన ఫోటోలపై ఓ నెటిజన్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. 'మానసికంగా దెబ్బతిన్న ఒక తెల్ల వ్యక్తిని మీరు ఇష్టపడి తప్పు చేశారు వినీ రామన్. ఈ విషయంలో మీరు ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండు. మీకు ప్రేమించడానికి భారత సంతతి వ్యక్తులు దొరకలేదా' అంటూ అసభ్యకర కామెంట్స్ చేశాడు. మాక్సీ.. గతేడాది అక్టోబర్‌లో తాను మానసిక సమస్యలతో సతమతమవుతున్నాని చెప్పి క్రికెట్‌కు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.

కాస్తయినా సిగ్గుపడాలి:
నెటిజన్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై వినీ రామన్ ఘాటుగా స్పందించారు. 'ఒక రాత్రిలో సెలబ్రిటీలు అయిపోవాలని కొందరు ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. అటువంటి వారి గురించి నేను అస్సలు పట్టించుకోను. అయితే ఈ కామెంట్ చూసి నాకు చాలా కోపం వచ్చింది. ప్రపంచమంతా అభివృద్ధితో ముందుకు సాగుతుంటే.. ఒక వ్యక్తి ఇలా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం దారుణమైన విషయం. ఈ వ్యాఖ్యలు చేసినందుకు కాస్తయినా సిగ్గుపడాలి' అని వినీ ఫైర్ అయ్యారు.

ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేం:
'ప్రేమ ఎప్పుడు-ఎక్కడ-ఎలా పుడుతుందో చెప్పలేం. నాకు నేనుగా ఓ వ్యక్తికి దగ్గరయ్యానంటే అది రంగు, దేశం చూసి కాదు. మంచి మనసు చూసి. నాకు మ్యాక్స్‌వెల్‌లో మంచి మనసు కనిపించింది. అందుకే అతన్ని ఇష్టపడ్డా. నేనెవరిని ఇష్టపడాలి, పెళ్లిచేసుకోవాలి అన్న విషయాలు నాకు నేనుగా తీసుకునేవి. ఓ తెల్లవ్యక్తిని ప్రేమించినంత మాత్రాన.. నా భారతీయ సంప్రదాయానికి వచ్చిన నష్టం ఏంలేదు. మీ అభిప్రాయం చెప్పడం సరైనదే కానీ అది ఎదుటివారిని బాధిస్తుందా లేదా అన్నది కూడా ఆలోచించుకోవాలి' అని వినీ రామన్ ట్వీట్ చేశారు.

నిన్ను చూస్తే గర్వంగా ఉంది:
వినీ రామన్ కామెంట్స్‌ను గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'వినీ నిన్ను చూస్తే గర్వంగా ఉంది. కొందరు పనిగట్టుకొని ఇలాంటి విమర్శలు చేస్తారు. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అని కామెంట్ రాసుకొచ్చాడు. శ్రీలంక సిరీస్ అనంతరం వినీ సలహాలతో మాక్సీ తన ఒత్తిడిని అధిగమించి బిగ్‌బాష్ 2020లో ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్‌లో పంజాబ్ తరపున ఆడుతున్నాడు.


Click it and Unblock the Notifications












