For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాక్సీనే ముందు ప్రపోజ్‌ చేశాడు.. ప్రేమ కోసం ఎంతో చేశా.. లవ్ సీక్రెట్స్‌ చెప్పిన విని రామన్‌!!

Glenn Maxwells Fiancee Vini Raman Shares Relationship Secrets With Pre-Isolation Picture

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌, పవర్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన విని రామన్‌తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న మ్యాక్స్‌వెల్.. మార్చి 17వ తేదీన భారతీయ సాంప్రదాయంలో రెండోసారి నిశ్చితార్థం చేసుకున్నాడు. గతేడాది మానసిక సమస్యలతో సతమతమైన క్షణంలో మ్యాక్సీకి వినీ ధైర్యం చెప్పింది. ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడమని చెప్పి తన సమస్యను దూరంలో చేయడంలో కీలక పాత్ర పోషించింది.

ప్రేమ కోసం ఎంత చేశానో:

ప్రేమ కోసం ఎంత చేశానో:

విని రామన్‌ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కాబోయే భర్త గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. ఆ ఫొటోకు క్యాప్షన్‌గా 'ప్రి ఐసోలేషన్‌' అని పెట్టింది. అంతేకాదు ఎడమవైపుకు స్వైప్‌ చేస్తే తమ ప్రేమ కోసం ఎంత చేశానో అర్థమవుతుంది అని కూడా రాసుకొచ్చింది. తొలిసారి ఎక్కడ కలిశాం అనే విషయం పాటు తమలో అత్యంత కాంపిటేటివ్‌గా ఉండే వ్యక్తి ఎవరు అనే అనేక విషయాలను విని రామన్‌ అభిమానులతో షేర్‌ చేసుకుంది.

మ్యాక్సీనే ప్రపోజ్‌ చేశాడు:

2013 డిసెంబర్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఈవెంట్‌లో తొలిసారి ఇద్దరం కలిశామని, తమ ప్రేమ పట్టాలెక్కడానికి నాలుగేళ్లు పట్టిందని వినీ రామన్‌ అభిమానులతో తెలిపింది. తొలుత మ్యాక్సీనే తనకు ప్రపోజ్‌ చేశాడని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేసింది. ఇద్దరి మధ్య 4 సంవత్సరాల 5 నెలల తేడా అని, తాను సున్నితమైన వ్యక్తని, మ్యాక్స్‌వెల్‌ తొందరగా పడుకుంటాడని, బాగా డ్రైవ్ చేస్తాడని ఇలా అభిమానులు అడిగిన ప్రశ్నల్లో భాగంగా తమ సీక్రెట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

విని రామన్ ఓ ఫార్మాసిస్ట్

విని రామన్ ఓ ఫార్మాసిస్ట్

మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి విని రామన్. ఆమె ఓ ఫార్మాసిస్ట్. తమిళనాడుకు చెందిన ఆమె పూర్వీకులు ఆస్ట్రేలియాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జోడీ ప్రేమ వ్యవహారం 2017లో తొలిసారి ప్రపంచానికి తెలిసింది. ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్-2019 కార్యక్రమానికి కూడా మ్యాక్సీ తన ప్రేయసీ వినితోనే హాజరయ్యాడు. చాలా సార్లు వారి ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పారు.

110 వన్డేలు.. 61 టీ20లు:

110 వన్డేలు.. 61 టీ20లు:

మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుతం వన్డేలు, టీ20ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో టెస్టులు కూడా ఆడాడు. ఇప్పటివరకు 110 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్‌ 2,877 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 61 టీ20లు ఆడి 1,576 పరుగులు చేసాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

వేలంలో భారీ ధర:

వేలంలో భారీ ధర:

గతేడాది చివరలో జరిగిన ఐపీఎల్ వేలంలో మాక్స్‌వెల్‌‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.10.75 కోట్లకు కోనుగోలు చేసింది. మ్యాక్సీ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. పలు ఫ్రాంఛైజీలు అతన్ని కొనుక్కోవడానికి పోటీపడ్డాయి. చివరకు భారీ మొత్తంకు పంజాబ్ దక్కించుకుంది. మోచేతి గాయం కారణంగా గత కొద్దిరోజులుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న మాక్స్‌వెల్.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ కరోనా వైరస్ కారణంగా మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్.. ఏప్రిల్ 15కి వాయిదా పడింది.

Story first published: Saturday, April 11, 2020, 15:54 [IST]
Other articles published on Apr 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+