For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత అమ్మాయితో మ్యాక్స్‌వెల్ ఎంగేజ్‌మెంట్.. భారత సాంప్రదాయంలోనే..!!

Glenn Maxwells fiancée Vini Raman posts pictures from their Indian style engagement

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌, పవర్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ భారత సంతతికి చెందిన విని రామన్‌తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం మనందరికి తెలిసిందే. ఇటీవలే వీరిద్దరు త్వరలో నిశ్చితార్థం చేసుకుంటామని కూడా ప్రకటించారు. కాగా.. శనివారం మెల్‌బోర్న్‌లోని తూరక్ ప్రాంతంలో మ్యాక్స్‌వెల్, వినిల నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

 భారత సంప్రదాయాల ప్రకారం మాక్స్‌వెల్‌ నిశ్చితార్థం:

భారత సంప్రదాయాల ప్రకారం మాక్స్‌వెల్‌ నిశ్చితార్థం:

భారత సంప్రదాయాల ప్రకారం మాక్స్‌వెల్‌తో తనకి నిశ్చితార్థం జరిగినట్లు విని రామన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 'గత రాత్రి మ్యాక్స్‌వెల్, నేను భారత సాంప్రదాయంలో నిశ్చితార్థం చేసుకున్నాం. మన వివాహ వేడుక ఎలా ఉంటుందో మ్యాక్స్‌వెల్‌కి చిన్న టీజర్ చూపించా' అని విని ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ సందర్భంగా అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక మాక్స్‌వెల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

విని రామన్ ఓ ఫార్మాసిస్ట్

విని రామన్ ఓ ఫార్మాసిస్ట్

మెల్‌బోర్న్‌లో స్థిర పడ్డ భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి విని రామన్. ఆమె ఓ ఫార్మాసిస్ట్. తమిళనాడుకు చెందిన ఆమె పూర్వీకులు ఆస్ట్రేలియాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జోడీ ప్రేమ వ్యవహారం 2017లో తొలిసారి ప్రపంచానికి తెలిసింది. ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్-2019 కార్యక్రమానికి కూడా మ్యాక్సీ తన ప్రేయసీ వినితోనే హాజరయ్యాడు. చాలా సార్లు వారి ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పారు.

క్రికెట్‌కు నిరవధిక విరామం:

క్రికెట్‌కు నిరవధిక విరామం:

విరామం లేని షెడ్యూల్ కారణంగా మానసిక సమస్యలకు గురైన మ్యాక్స్‌వెల్ క్రికెట్‌కు నిరవధిక విరామన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తనకు మానసిక సమస్య ఉందని మొదట గుర్తించింది కూడా తన గర్ల్ ఫ్రెండ్ విని రామనేనని అప్పట్లో మ్యాక్సీ తెలిపాడు. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2019-20 సమయంలో మ్యాక్స్‌వెల్‌ ఎడమ మోచేయికి గాయం అయింది. ఈ గాయానికి మ్యాక్సీ శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నాడు.

 వేలంలో భారీ ధర:

వేలంలో భారీ ధర:

గతేడాది చివరలో జరిగిన ఐపీఎల్ వేలంలో మాక్స్‌వెల్‌‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.10.75 కోట్లకు కోనుగోలు చేసింది. మ్యాక్సీ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. పలు ఫ్రాంఛైజీలు అతన్ని కొనుక్కోవడానికి పోటీపడ్డాయి. చివరకు భారీ మొత్తంకు పంజాబ్ దక్కించుకుంది. మోచేతి గాయం కారణంగా గత కొద్దిరోజులుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న మాక్స్‌వెల్.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ కరోనా వైరస్ కారణంగా మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్.. ఏప్రిల్ 15కి వాయిదా పడింది.

110 వన్డేలు.. 61 టీ20లు:

మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుతం వన్డేలు, టీ20ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో టెస్టులు కూడా ఆడాడు. ఇప్పటివరకు 110 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్‌ 2,877 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 61 టీ20లు ఆడి 1,576 పరుగులు చేసాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Sunday, March 15, 2020, 20:28 [IST]
Other articles published on Mar 15, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+