Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ వీడియో: మ్యాక్స్‌వెల్ హెలికాఫ్టర్ షాట్.. అచ్చం ధోనీ లాగే!!

Maxwell Imitates MS Dhoni's Helicopter Shot ! || Oneindia Telugu
Glenn Maxwell played MS Dhonis Helicopter Shot With Stunning Six

అడిలైడ్: క్రికెట్‌ చరిత్రలో హెలికాఫ్టర్ షాట్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. బ్యాట్‌ను హెలికాఫ్టర్ రెక్కల్లా గుండ్రగా తిప్పుతూ ధోనీ కొట్టే సిక్సులు చాలా ఫేమస్. ధోనీ ఈ షాట్ కొడితే.. కచ్చితంగా బంతి స్టాండ్స్‌లోకి వెళ్లాల్సిందే. ధోనీ ప్రవేశపెట్టిన ఈ షాట్‌ను ఎందరో యువ క్రికెటర్లు ఆడేందుకు ప్రయత్నించారు. వీరిలో కొందరు సఫలమైతే.. మరి కొందరికి మాత్రం పరాభవం తప్పలేదు. హార్డిక్ పాండ్యా సఫలం కాగా.. వెస్టిండీస్ ఆటగాడు కీమో పాల్‌ విఫలమయ్యాడు.

మ్యాక్స్‌వెల్ హెలికాఫ్టర్ షాట్:

మ్యాక్స్‌వెల్ హెలికాఫ్టర్ షాట్:

ధోనీ ఫ్యాన్ అయిన సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ కూడా హెలికాఫ్టర్ షాట్ ప్రయత్నించాడు. తాజాగా అడిలైడ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌, బిగ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ హెలికాఫ్టర్ షాట్ ఆడాడు. పేసర్ కసున్ రజితా వేసిన 18వ ఐదవ బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతిని హెలికాఫ్టర్ షాట్ ఆడి స్టాండ్స్‌లోకి పంపాడు. అచ్చం ధోనీ లాగే ఆడి అందరిని ఆశ్చర్యపరిచాడు.

అచ్చం ధోనీ లాగే:

ఇందుకు సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు ఈ వీడియో చూసి మ్యాక్స్‌వెల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'వావ్.. వాట్ ఏ షాట్' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'అచ్చం ధోనీ లాగే కొట్టావ్ మ్యాక్స్‌వెల్‌' అని మరో అభిమాని కామెంట్ చేసాడు.

ఆస్ట్రేలియా భారీ విజయం:

ఆస్ట్రేలియా భారీ విజయం:

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్‌ వార్నర్, మ్యాక్స్‌వెల్‌ పరుగుల సునామీ సృష్టించడంతో శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 134 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వార్నర్‌ (100; 56 బంతుల్లో 10x4,4x6) సెంచరీ చేయగా.. మ్యాక్స్‌వెల్‌ (62; 28 బంతుల్లో 7x4, 3x6) మెరుపు అర్ధ సెంచరీ చేశాడు. లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేసి భారీ ఓటమిని మూటగట్టుకుంది. దసున్‌ షనక (17) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

టీ20ల్లో అత్యధిక పరుగులు:

టీ20ల్లో అత్యధిక పరుగులు:

ఈ మ్యాచ్‌లో ఫించ్‌, వార్నర్‌, మ్యాక్స్‌వెల్ ఊచకోత కోయడంతో శ్రీలంక పేసర్‌ కసున్ రజిత తన ఖాతాలో పేలవమైన రికార్డు వేసుకున్నాడు. రజిత వేసిన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా 75 పరుగులు ఇచ్చాడు. దీంతో టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టర్కీ బౌలర్ తునాహన్ తురాన్ పేరిట ఉండేది. గత ఆగస్టులో చెక్ రిపబ్లిక్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులు ఇచ్చాడు.

Story first published: Monday, October 28, 2019, 12:47 [IST]
Other articles published on Oct 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+