Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాక్స్‌వెల్‌‌ ఐపీఎల్‌ ఎలెవన్.. మోహిత్‌కు చోటు.. రోహిత్‌కు షాక్!!

Glenn Maxwell names best IPL XI, no place for Rohit Sharma, picks Mohit Sharma as frontline seamer

సిడ్నీ: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఇక ఐపీఎల్ 2020కి దాదాపు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తన అత్యుత్తమ ఐపీఎల్‌ జట్టును ప్రకటించాడు.

రోహిత్‌కు దక్కని చోటు:

రోహిత్‌కు దక్కని చోటు:

తాజాగా గ్లెన్ మాక్స్‌వెల్ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లేతో కలిసి క్రిక్‌బజ్ చాట్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాక్స్‌వెల్ తన అత్యుత్తమ ఐపీఎల్‌ జట్టును ఎంచుకున్నాడు. ఓపెనర్ల కోసం డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీలను ఎంచుకున్నాడు. ఇక్కడ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు మాక్స్‌వెల్ తన జట్టులో చోటివ్వలేదు. మూడు, నాలుగు స్థానాల కోసం ఏబీ డివిలియర్స్, సురేష్ రైనాలను తీసుకున్నాడు. ఇక ఐదవ స్థానం కోసం తననే ఎంపికచేసుకున్నాడు.

మోహిత్ శర్మకు చోటు:

మోహిత్ శర్మకు చోటు:

ఏకైక ఆల్ రౌండర్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ స్టార్ ఆండ్రీ రస్సెల్‌కు గ్లెన్ మాక్స్‌వెల్ అవకాశం ఇచ్చాడు. ఇక వికెట్ కీపర్ కోసం ఎంఎస్ ధోనీని ఎంచుకున్నాడు. ఒక స్పిన్నర్‌గా హర్భజన్ సింగ్‌కు చోటిచ్చాడు. మాక్స్‌వెల్ పేస్ విభాగంలో ముగ్గురికి చోటిచ్చాడు. భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రాలను సీమర్‌లుగా ఎంచుకోవడం పక్కన పెడితే.. మాజీ సహచరుడు మోహిత్ శర్మ పేరును తన ఐపీఎల్‌ ఎలెవన్ జట్టులో మూడవ ఫ్రంట్‌లైన్ సీమర్‌గా తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ లసిత్ మలింగ, ఫ్యాట్ కమ్మిన్స్, ట్రెంట్ బోల్ట్ జోఫ్రా ఆర్చర్ లాంటి పేసర్లకు అవకాశం ఇవ్వలేదు.

కెప్టెన్ ఎవరో:

కెప్టెన్ ఎవరో:

గ్లెన్ మాక్స్‌వెల్, మోహిత్ శర్మలు కలిసి 2016, 2017 సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడారు. ఈసారి వేలంలో మోహిత్ శర్మను క్యాపిటల్స్ కోలుగోలు చేసింది. ఇక గ్లెన్ మాక్స్‌వెల్‌‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.10.75 కోట్లకు కోనుగోలు చేసింది. మ్యాక్సీ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. పలు ఫ్రాంఛైజీలు అతన్ని కొనుక్కోవడానికి పోటీపడ్డాయి. చివరకు భారీ మొత్తంకు పంజాబ్ దక్కించుకుంది. అయితే మ్యాక్సీ తన ఐపీఎల్ జట్టుకు కెప్టెన్ ఎవరో మాత్రం చెప్పలేదు.

మాక్స్‌వెల్‌‌ ఐపీఎల్‌ ఎలెవన్:

మాక్స్‌వెల్‌‌ ఐపీఎల్‌ ఎలెవన్:

డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, సురేష్ రైనా, గ్లెన్ మాక్స్‌వెల్, ఆండ్రీ రస్సెల్, ఎంఎస్ ధోనీ, హర్భజన్ సింగ్, మోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Wednesday, August 12, 2020, 14:18 [IST]
Other articles published on Aug 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+