Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బిగ్ బాష్ లీగ్: మాక్స్‌వెల్, వేడ్‌లకు కెప్టెన్లుగా ప్రమోషన్

Glenn Maxwell, Matthew Wade named captains in Big Bash League

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్లు గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్‌లకు బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో కెప్లెన్లుగా ప్రమోషన్ లభించింది. డిసెంబర్ 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు జరగనున్న బిగ్ బాష్ లీగ్‌లో ఎనిమిదో సీజన్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ జట్టుకు మాక్స్‌వెల్.. హోబార్ట్ హరికేన్స్ జట్టుకు వేడ్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.

ఈ మేరకు ఆయా ప్రాంఛైజీలు ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేశాయి. ఈ సందర్భంగా మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ "మెల్‌బోర్న్ టీమ్ కెప్టెన్‌గా ఎంపికైనందుకు చాలా గర్వంగా ఉంది. వచ్చే సీజన్‌ను గొప్పగా ముగించేందుకు హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని పేర్కొన్నాడు.

ఇక, వేడ్ విషయానికి వస్తే జార్జ్ బెయిలీ స్థానంలో హోబార్ట్‌ హరికేన్స్ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ సందర్భంగా వేడ్ మాట్లాడుతూ "అద్భుతమైన జట్టుకు కెప్టెన్‌గా ఎంపికవడం గౌరవంగా భావిస్తున్నా. కెప్టెన్‌గా సరైన నిర్ణయాలు తీసుకుని జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తా" అని తెలిపాడు.

Story first published: Wednesday, December 12, 2018, 17:41 [IST]
Other articles published on Dec 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+