Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Big Bash League: మాక్స్‌వెల్ విధ్వంసం.. టోర్నీ చ‌రిత్ర‌లోనే భారీ సెంచ‌రీ

Glenn Maxwell Massive Century In Total Big Bash League History

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ విశ్వ‌రూపం చూపించాడు. భారీ సెంచ‌రీతో విధ్వంసం సృష్టించాడు. బౌండ‌రీల వ‌ర‌ద పారించి హోబర్ట్ హరికేన్స్ బౌల‌ర్ల‌కు ప‌ట్ట ప‌గ‌లే చుక్క‌లు చూపించాడు. ఈ క్ర‌మంలో బిగ్‌బాష్ లీగ్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ న‌మోదు చేశాడు. హరికేన్స్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోస్తూ మాక్స్‌వెల్ సృష్టించిన విధ్వంసానికి బిగ్‌బాష్ చ‌రిత్ర‌లోనే మెల్‌బోర్న్ స్టార్స్ జ‌ట్టు అత్య‌ధిక స్కోర్‌ను న‌మోదు చేసింది.

మాక్స్‌వెల్ విధ్వంసం

మాక్స్‌వెల్ విధ్వంసం

బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌, హోబ‌ర్ట్ హ‌రికేన్స్ మ‌ధ్య నేడు మెల్‌బోర్న్ వేదిక మ్యాచ్ జ‌రిగింది. టోర్నీలో ఇది 56వ మ్యాచ్‌. టాస్ ఓడిన మెల్‌బోర్న్ బ్యాటింగ్‌కు దిగింది. ఆ జ‌ట్టు కెప్టెన్ గ్లెన్ మాక్స్‌వెల్ ఓపెన‌ర్‌గా వ‌చ్చాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన మాక్స్‌వెల్ హ‌రికేన్స్ బౌల‌ర్ల‌పై ముప్పేట దాడి చేశాడు. వ‌రుస‌గా బౌండ‌రీలు బాదుతూ హ‌రికేన్స్ బౌల‌ర్ల‌ను ముప్ప తిప్ప‌లు పెట్టాడు. ఈ క్ర‌మంలో 20 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. హాఫ సెంచ‌రీ అనంత‌రం మ‌రింత చెల‌రేగిన మాక్స్‌వెల్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో 41 బంతుల్లోనే సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఈ బిగ్‌బాష్‌ సీజ‌న్‌లో ఇది రెండో సెంచ‌రీ.

మాక్స్‌వెల్ రికార్డుల మోత‌

సెంచ‌రీ అనంత‌రం మ‌రింత రెచ్చిపోయిన మాక్స్‌వెల్ ప‌రుగుల సునామీ సృష్టించాడు. మాక్స్‌వెల్ విశ్వరూపించ‌డంతో బంతులు ఎక్క‌డ వేయాలో అర్థం కాక హ‌రికేన్స్ బౌల‌ర్లు ముప్ప తిప్ప‌లు ప‌డుతూ భారీగా ప‌రుగులు సమ‌ర్పించుకున్నారు. మొత్తం 64 బంతులు ఎదుర్కొన్న మాక్స్‌వెల్ 154 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. మాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 22 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. 154 ప‌రుగులు చేయ‌డం ద్వారా బిగ్‌బాష్ లీగ్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ న‌మోదు చేసిన ఆట‌గాడిగా రికార్డు న‌మోదు చేశాడు. అంతేకాకుండా ఈ టోర్నీలో 150 ప‌రుగులు చేసిన తొలి ఆట‌గాడిగా నిలిచాడు. అలాగే ఒకే ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక బౌండ‌రీలు బాదిన ఆట‌గాడిగా రికార్డుల పుట్ట‌ల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్‌లో మాక్స్‌వెల్ ఏకంగా 240 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయ‌డం విశేషం.

స్టోయినిస్ విధ్వంసం

స్టోయినిస్ విధ్వంసం

మాక్స్‌వెల్ విశ్వ‌రూపానికి తోడు స్టోయినిస్ కూడా విధ్వంసం సృష్టించాడు. మ్యాచ్‌లో మొత్తంగా 31 బంతులు ఎదుర్కొన్న స్టోయినీస్ 6 సిక్స్‌లు, 4 ఫోర్ల‌తో 75 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. మాక్స్‌వెల్‌, స్టోయినిస్ క‌లిసి మూడో వికెట్‌కు అజేయంగా 54 బంతుల్లోనే 132 ప‌రుగులు జోడించారు. అంత‌కు ముందు మ‌రో ఓపెన‌ర్ క్లార్క్ 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 18 బంతుల్లోనే 35 ప‌రుగులు చేశాడు.

T20 World Cup 2021 : మళ్ళీ తుస్సుమనిపించిన Warner, ఆ 2 బంతులు వల్లే గెలుపు..! || Oneindia Telugu
 మెల్‌బోర్న్ స్టార్స్ భారీ స్కోర్‌

మెల్‌బోర్న్ స్టార్స్ భారీ స్కోర్‌

ఇలా మాక్స్‌వెల్‌, స్టోయినిస్‌, క్లార్క్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మెల్‌బోర్న్ స్టార్స్ 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 273 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. బిగ్‌బాష్ లీగ్ చ‌రిత్ర‌లో ఇదే అత్య‌ధిక స్కోర్‌. మొత్తంగా టీ20 చరిత్ర‌లో ఇది మూడో అత్య‌ధిక స్కోర్‌. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ బ్యాట‌ర్ల‌ను కట్ట‌డి చేయ‌డానికి హ‌రికేన్స్ జ‌ట్టు 8 మందితో బౌలింగ్ చేయించిన ఏ మాత్రం ఫ‌లితం లేక‌పోయింది.

Story first published: Wednesday, January 19, 2022, 16:49 [IST]
Other articles published on Jan 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+