Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Glenn Maxwell:బెట్టింగ్‌లో ఓడిపోయిన మాక్సీ.. పాపం వరుసగా రెండు షాక్‌లు!

ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్-13 ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో బ్రిస్బేన్ హీట్-మెల్ బోర్న్ స్టార్స్ తలపడ్డాయి. హోరాహొరీగా సాగుతుందనకుంటే మ్యాచ్ వన్ సైడ్ గా మారి చప్పగా ముగిసింది. మెల్ బోర్న్ స్టార్స్ 103 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. బ్రిస్బేన్ ఆల్ రౌండర్ షో తో అదరగొట్టింది.

తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ మూడు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ఓపెనర్ మన్రో ఆఖరి వరకు క్రీజులో ఉండి 99 పరుగులు చేశాడు. లబుషేన్ (30), కెప్టెన్ ఖవాజా (28) పరుగులు చేశారు. ఇక మెల్ బోర్న్ బౌలర్లలో జోయెల్, కౌల్టర్ నైల్ , మాక్సీ తలో వికెట్ తీశారు.

Glenn Maxwell lost the bet to Colin Munro. Two shocks in a row

అనంతరం భారీ ఛేదనకు బరిలోకి దిగిన మెల్ బోర్న్ స్టార్స్ 15.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రోజర్స్ (1), సామ్ హర్పెర్ (4) తొలి ఓవర్ లోనే పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్ మాక్సీ (14 బంతుల్లో 23 పరుగులు), హిల్టన్ (16 బంతుల్లో 33) దూకుడుగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.

అయితే ఈ మ్యాచ్ కు ముందు మన్రో, మాక్స్ వెల్ ఓ బెట్ వేసుకున్నారు. వారిద్దరిలో ఎవరైతే హాఫ్ సెంచరీ చేయలేరో.. సాధించిన వారికి పార్టీ ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. 99 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న మన్రో ఈ బెట్ ను గెలిచాడు. అవార్డు తీసుకున్న తర్వాత మన్రో మాట్లాడుతూ.. మాక్సీతో తాను చేసుకున్న బెట్ విషయాలను వివరించాడు. KFCలో తనకి మాక్సీ పార్టీ ఇవ్వనున్నట్లు చెప్పాడు.

అయితే ఈ ఫన్నీ బెట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. మ్యాచ్ ఓడిపోయిన బాధను దిగమింగి.. మన్రో మంచి పార్టీ ఇవ్వమని సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, ఇవాళ సిడ్నీ వేదికగా సిడ్నీ సిక్సర్స్-మెల్ బోర్న్ రెనెగేడ్స్ తలపడనున్నాయి.

Story first published: Friday, December 8, 2023, 12:44 [IST]
Other articles published on Dec 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+