For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంజాబ్ అభిమానులకు షాక్.. ఐపీఎల్‌కు ఆసీస్ భారీ హిట్టర్ దూరం!!

Glenn Maxwell likely to miss initial phase of IPL 2020 due to elbow injury

ఢిల్లీ: ఆస్ట్రేలియా బిగ్‌ హిట్టర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్‌ ప్రారంభ దశకు దూరం కానున్నాడు. మోచేతి గాయం కారణంగా మ్యాక్స్‌వెల్‌ రెండు వారాల పాటు ఐపీఎల్‌కు దూరం కానున్నాడని సమాచారం తెలిసింది. మ్యాక్స్‌వెల్‌ కుడి మోచేతి వద్ద గాయమైనట్టు స్కానింగ్‌లో బయపడిందని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది. మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌-12 సీజన్ ఆడని విషయం తెలిసిందే. టోర్నమెంట్ నుండి అతడే స్వయంగా వైదొలిగాడు.

రెండు వారాలు దూరం:

రెండు వారాలు దూరం:

బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2019-20 సమయంలో మ్యాక్స్‌వెల్‌ ఎడమ మోచేయికి గాయం అయింది. ఈ గాయానికి మ్యాక్సీ శస్త్రచికిత్స చేయించుకోబోతున్నాడు. మెల్బోర్న్‌లో గురువారం మోచేయికి శస్త్రచికిత్స చేయనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అయితే శస్త్రచికిత్స అనంతరం అతడు కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుంది. ఐపీఎల్ 2020 మార్చి చివరి వారంలో మొదలయ్యే అవకాశం ఉండడంతో.. టోర్నీ ప్రారంభ రెండు వారాలకు మ్యాక్సీ దూరం కానున్నాడు.

 వేలంలో భారీ ధర:

వేలంలో భారీ ధర:

గతేడాది చివరలో జరిగిన ఐపీఎల్ వేలంలో ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.10.75 కోట్లకు కోనుగోలు చేసింది. మ్యాక్సీ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. పలు ఫ్రాంఛైజీలు అతన్ని కొనుక్కోవడానికి పోటీపడ్డాయి. చివరకు భారీ మొత్తంకు పంజాబ్ దక్కించుకుంది. మోచేతి గాయం కారణంగా మ్యాక్స్‌వెల్‌ రెండు వారాల పాటు ఐపీఎల్‌కు దూరం కానుండడంతో పంజాబ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

10 వన్డేలు.. 61 టీ20లు:

10 వన్డేలు.. 61 టీ20లు:

బీబీఎల్ టోర్నీకి ముందు మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా క్రికెట్‌ నుంచి మాక్స్‌వెల్ స్వల్ప విరామం తీసుకున్న విషయం తెలిసిందే. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా శ్రీలంకతో టీ20 సిరీస్ జరుగుతుండగానే అర్ధంతరంగా తప్పుకున్నాడు. మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుతం వన్డేలు, టీ20ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో టెస్టులు కూడా ఆడాడు. ఇప్పటివరకు 110 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్‌ 2,877 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 61 టీ20లు ఆడి 1,576 పరుగులు చేసాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఆర్చర్ ఔట్:

ఆర్చర్ ఔట్:

ఐపీఎల్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. గత రెండు సీజన్లలో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఇంగ్లీష్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మోచేతి గాయం కారణంగా సీజన్-13 దూరమయ్యాడు. 2018లో ఐపీఎల్‌కు ఎంపికైన ఆర్చర్.. గత రెండు సీజన్లలో కలిసి 26 వికెట్లు తీశాడు. మోచేయి గాయం కారణంగా ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్, శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

Story first published: Wednesday, February 12, 2020, 14:56 [IST]
Other articles published on Feb 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+