
వన్డేల్లో అరంగేట్రం చేయనున్న లబుషేన్
దీంతో లబుషేన్ తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. గతేడాది టెస్ట్ క్యాప్ సంపాదించినప్పటి నుండి లబుషేన్ 58.05 సగటున పరుగులు చేసాడు. ఇక చివరి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో సెంచరీలు సాధించాడు. భారత్‌తో సిరిస్‌కు లబుషేన్‌ను ఎంపిక చేయడం ద్వారా గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు చోటు దక్కలేదు.

ఫించ్ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో ఫించ్ మాట్లాడుతూ "భారత్‌తో సిరిస్‌కు చోటు దక్కకపోవడంతో మాక్సీ కచ్చితంగా నిరాశ చెందే ఉంటాడు. అతడు ఈ మధ్య వన్డేల్లో అంతగా రాణించలేదు. అతడు తిరిగిరావడంలో సందేహం లేదు. అతడు త్రీ డైమెన్షనల్ ప్లేయర్. అలాంటి ఆటగాడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పరుగులు చేయడం ఆరంభించగానే జట్టులోకి వస్తాడు" అని అన్నాడు.

ఐదేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి అబోట్
భారత పర్యటనలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, కౌల్టర్ నైల్, మార్కస్ స్టొయినిస్, నాథన్ లయాన్, గ్లెన్ మాక్స్‌వెల్‌లకు జట్టులో చోటు దక్కలేదు. పేసర్ బెరెన్‌డార్ఫ్ గాయంతో దూరమయ్యాడు. ఆల్‌రౌండర్ సీన్ అబోట్ ఐదేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.
గత రెండేళ్లలో 50 ఓవర్ల ఫార్మాట్లో: మరో ప్రపంచ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ

అష్టన్ అగర్ మరో అవకాశం
స్పిన్నర్ అష్టన్ అగర్ మరో అవకాశం దక్కించుకున్నాడు. జోష్ హాజిల్‌వుడ్‌కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లు ఎవరికీ తలుపులు మూసుకుపోలేదని ఆరోన్ ఫించ్ చెప్పుకొచ్చాడు. నాథన్ లయాన్ అనుభవజ్ఞుడే అయినా ఉపఖండం పరిస్థితుల్లో ఆస్టన్ ఆగర్‌ను పరీక్షించాలని సెలక్టర్లు భావించారు.

జనవరి 14న మొదలై 19తో
భారత పర్యటనలో ఆస్ట్రేలియా హెడ్ కోచ్‌గా సీనియర్ అసిస్టెంట్ కోచ్ మెక్ డొనాల్డ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ పర్యటన జనవరి 14న మొదలై 19తో ముగుస్తుంది. జనవరి 14న తొలి వన్డే (ముంబై), 17న రెండో వన్డే (రాజ్‌కోట్), 19న మూడో వన్డే (బెంగళూరు)లో జరగనుంది.