Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త పెళ్లికొడుకు వచ్చేస్తోన్నాడు: హోటల్‌లో బెడ్ రెడీ చేసిన రాయల్ ఛాలెంజర్స్

Glenn Maxwell has joined with RCB and grand welcome arranged by the team at the hotel

ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులకు గుడ్ న్యూస్. ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఆల్ రౌండర్, కొత్త పెళ్లికొడుకు గ్లెన్ మాక్స్‌వెల్ వచ్చేస్తున్నాడు. 6వ తేదీన అతను జట్టుతో కలిసే అవకాశం ఉంది. 9వ తేదీ నాటి మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండబోతోన్నాడు. ఇటీవలే మ్యాక్స్‌వెల్ ఓ ఇంటి వాడయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్, భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను పెళ్లి చేసుకున్నాడు. కిందటి నెల 18వ తేదీన ఈ పెళ్లి జరిగింది.

ప్రస్తుతం అతను క్వారంటైన్‌ పీరియడ్‌లో ఉంటోన్నాడు. ఇంకో నాలుగు రోజుల్లో క్వారంటైన్ కాలం ముగుస్తుంది. 6వ తేదీ నాటికి రాయల్ ఛాలెంజర్స్‌తో కలవనున్నాడు. వినీ రామన్ కుటుంబం సంప్రదాయం ప్రకారం మ్యాక్స్‌వెల్ పెళ్లి ఘనంగా జరిగింది. తమిళ సంప్రదాయ పద్ధతిలో వినీ రామన్‌ను పెళ్లాడాడు. త్వరలోనే తాను భారత్‌కు రానున్నట్లు సోషల్ మీడియాలో లీక్ ఇచ్చాడు. తన పాస్‌పోర్ట్, విమాన టికెట్ల ఫొటోలను పోస్ట్ చేశాడు.

కొత్త పెళ్లికొడుకు రాక కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆతృతంగా ఎదురు చూస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరుపులు మెరిపించగల మ్యాడ్ మ్యాక్సీ జట్టుకు అందుబాటులో లేని లోటు స్పష్టంగా కనిపించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ సాధించినప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోయింది. బౌలర్లు ఫ్లాప్ అయ్యారు. కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో చావుతప్పి కన్నులొట్టబోయినట్టయింది ఆర్సీబీ పరిస్థితి. స్వల్ప స్కోరును సాధించడానికి చివరి ఓవర్ వరకూ ఆడాల్సి వచ్చింది.

Glenn Maxwell has joined with RCB and grand welcome arranged by the team at the hotel

ఈ పరిస్థితుల్లో విధ్వంసకారుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ అందుబాటులోకి వస్తే- ఇక అన్నీ సర్దుకుంటాయని ఆర్సీబీ భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ డిపార్ట్‌మెంట్స్ బలోపేతమౌతాయి. కాగా- మ్యాక్స్‌వెల్ తన భార్యతో కలిసి భారత్‌కు రానున్నాడు. దీనికోసం టీమ్ మేనేజ్‌మెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కొత్త పెళ్లికొడుకు కోసం తాము బస చేసిన హోటల్‌లో ప్రత్యేక గదిని కేటాయించింది. కొత్త జంట కోసం బెడ్‌ను సైతం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు మ్యాక్స్‌వెల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Story first published: Friday, April 1, 2022, 14:53 [IST]
Other articles published on Apr 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+