Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతనే అత్యుత్తమ బౌలర్.. బ్యాటర్లకు దడదడ!: మాక్స్‌వెల్

తాను ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అని ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తెలిపాడు. అంతేకాదు, ప్రపంచ అత్యుత్తమ మూడు ఫార్మాట్ల బౌలర్ బుమ్రా అని కొనియాడాడు. బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడానికి బుమ్రా వద్ద ఎన్నో అస్త్రాలు ఉంటాయని పేర్కొన్నాడు. మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా గురించి మాక్సీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

''నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా. అన్ని ఫార్మాట్ల అత్యుత్తమ బౌలర్ బుమ్రా. అతను బంతిని వదిలే స్థానం భిన్నంగా ఉంటుంది. అతను ఆఖరి నిమిషంలో బంతిని వేసే గమ్యాన్ని మార్చుకోగలడు. ఎవరూ ఊహించని స్లో బాల్‌ను వేయగలడు. అద్భుతమైన యార్కర్ సంధించగలడు. బంతిని రెండు వైపుల స్వింగ్ చేయగలడు. అతనికి అద్భుతమైన మణికట్టు ఉంది. బుమ్రాకు ఎంతో సామర్థ్యం కలదు'' అని మాక్సీ పేర్కొన్నాడు.

Glenn Maxwell Hails Jasprit Bumrah as Potential Greatest All-Format Bowler of All Time

సిక్సర్లు సునాయాసంగా బాదే విధ్వంసకర ప్లేయర్ మాక్స్‌‌వెల్ బుమ్రా బౌలింగ్‌లో సత్తాచాటలేకపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 మ్యాచ్‌ల్లో బుమ్రాను ఎదుర్కొన్న మాక్సీ ఏకంగా ఏడు సార్లు ఔటయ్యాడు. 115 స్ట్రైక్‌రేటు, 10 సగటుతో 75 పరుగులే చేశాడు. ఒకే ఒక్క సిక్సర్ మాత్రమే సాధించగలడు. 30 ఏళ్ల బుమ్రా 40 టెస్టులు, 89 వన్డేలు, 70 టీ20లు ఆడాడు.

జస్‌ప్రీత్ బుమ్రా టెస్టుల్లో 173 వికెట్లు, వన్డేల్లో 149, టీ20ల్లో 89 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం టెస్టుల్లో బుమ్రా ప్రపంచ నంబర్ వన్ బౌలర్. వన్డే ఫార్మాట్‌లో బుమ్రా ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. కాగా, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు బుమ్రా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రిటైన్ లిస్ట్‌లో బుమ్రాను తొలి ప్రాధాన్యత ఎంపికగా ముంబై తీసుకోవాలని భావిస్తోంది. నిబంధనల ప్రకారం తొలి ప్రాధాన్యతకు ఫ్రాంచైజీ రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

Story first published: Monday, October 28, 2024, 18:11 [IST]
Other articles published on Oct 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+