PHOTO: మ్యాక్స్‌వెల్‌కు ముద్దు పెట్టిన భారత సంతతి యువతి

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మెల్ బోర్న్‌కు చెందిన భారత యువతి విని రామన్‌తో ప్రేమలో పడ్డాడంటూ గత కొంతకాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గత నెలలో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే, ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ తాజాగా విని రామన్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేశారు. విని రామన్ ఎవరో కాదు ఆస్ట్రేలియా స్థిరపడిన భారత సంతతి కుటుంబానికి చెందిన అమ్మాయి.
వీరిద్దరూ డేటింగ్‌లో
గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో మునిగి తేలుతున్నారు. 2017లో మొదటిసారి గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఉన్న ఫోటోను విని రామన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అప్పటి నుంచి పలు సందర్భాల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఉన్న ఫోటోలను ఆమె పోస్టు చేస్తూనే ఉన్నారు.

ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డులకు సైతం
ఈ ఏడాది మొదట్లో జరిగిన ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డులకు విని రామన్‌తో కలిసి గ్లెన్ మ్యాక్స్‌వెల్ హాజరైన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

మ్యాక్స్‌వెల్ గనుక విని రామన్ పెళ్లాడితే
మ్యాక్స్‌వెల్ గనుక విని రామన్ పెళ్లాడితే భారత అమ్మాయిని పెళ్లాడిన ఆసీస్ రెండో క్రికెటర్‌గా నిలుస్తాడు. గతంలో ఆస్ట్రేలియా పేసర్ షాన్ టైట్ భారత యువతినే పెళ్లాడాడు. ఐపీఎల్ 2014 సమయంలో ఓ వేడుకలో పరిచయమైన మషూమ్ సింఘా ప్రేమలో పడ్డాడు.

టీ20 బ్లాస్ట్‌లో లాంక్‌షైర్ తరఫున
ఆ తర్వాత వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు భారత్‌లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. గత ఐపీఎల్ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో లాంక్‌షైర్ తరఫున ఆడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications