Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Glenn Maxwell : గుడ్ న్యూస్ చెప్పిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ జంట.. విషాదం తర్వాత సంతోషం అంటూ పోస్ట్!

ప్రస్తుతం ఐపీఎల్ 2023లో మంచి ఫామ్ కనబరుస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు మరో గుడ్ న్యూస్ వినిపించింది. మ్యాక్సీ భార్య విని రామన్ గర్భవతి అని తెలిసింది. ఈ వార్తను విని తన సోషల్ మీడియాలో వెల్లడించింది. గతేడాది మార్చిలో విని, మ్యాక్సీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

క్రిస్టియన్, తమిళ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్న ఈ ఇద్దరికీ మగబిడ్డ పుట్టబోతున్నట్లు విని వెల్లడించింది. 'ఈ ఏడాది సెప్టెంబరులో మా కన్నుల పంట, రెయిన్‌బో బేబీ పుట్టబోతున్నట్లు ప్రకటించడనాకి గ్లెన్, నేను ఇద్దరం చాలా సంతోషిస్తున్నాం. ఈ జర్నీ అంత ఈజీగా, సాఫీగా సాగలేదే. ఆ విషయాన్ని గుర్తించడానికి కూడా ఈ క్షణం చాలా ముఖ్యం' అని ఆమె చెప్పింది.

Glenn Maxwell and Vini Good News

'ఇలాంటి పోస్టులు చూసినప్పుడల్లా మా జీవితాల్లో ఎప్పుడు ఇలాంటి క్షణం వస్తుందా? అని ఆలోచిస్తూ బాధపడటం నాకు అనుభవమే' అని చెప్పిన ఆమె.. పిల్లలు కనడానికి ఇబ్బందులు ఉన్న, అలాగే పుట్టక ముందే పిల్లలను కోల్పోయిన జంటలు అందరికీ తాము ప్రేమను పంపుతున్నట్లు కూడా విని పేర్కొంది. అలాగే తమకు అబ్బాయి పుడుతున్నట్లు ప్రకటించింది.

ఈ పోస్టుపై మ్యాక్సీ టీంమేట్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతోపాటు ఆరోన్ ఫించ్ భార్య అమీ ఫించ్, ఉస్మాన్ ఖవాజా భార్య రచెల్ ఖవాజా తదితరులు స్పందించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని మ్యాక్స్‌వెల్ జంటకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఇలా తమకు కంగ్యాచ్యులేషన్స్ చెప్పిన వారికి కూడా విని ధన్యవాదాలు తెలిపింది.

తను చేసిన ఒరిజినల్ పోస్టుకు రిప్లైగా మరో పోస్టు పెట్టిన ఆమె.. 'మాకు ఇంత ప్రేమ దక్కడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. కొంత మందికి రెయిన్‌బో బేబీ అంటే తెలియడం లేదు. రెయిన్‌బో బేబీ అంటే ఒకసారి గర్భస్రావం, మోలార్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇలా ఏదో ఒక కారణంతో బిడ్డను కోల్పోయిన తర్వాత పుట్టే బిడ్డ. తుఫాను తర్వాత ఇంద్ర ధనసు వచ్చినట్లు ఇలా విషాదం తర్వాత సంతోషం రావడాన్ని ఆ పేరు వివరిస్తుంది' అని ఆమె వివరించింది.

Story first published: Thursday, May 11, 2023, 20:36 [IST]
Other articles published on May 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+