Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టార్‌ ప్లేయర్‌కు విరిగిన కాలు.. భారత్‌లో సిరీస్‌కు కూడా కష్టమేనంటున్న డాక్టర్లు

Glenn Maxwell broke his leg in a freak accident

ప్రపంచ క్రికెట్‌లో గాయాల పర్వం నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక జట్టు తర్వాత మరొక జట్టుకు సంబంధించిన స్టార్ ప్లేయర్ గాయాలతో కీలకమైన టోర్నీలకుద దూరం అవుతున్నారు.

భారత్‌కు కూడా ఈ గాయాల బెడద వల్లే రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా ఈ ప్రపంచకప్‌లో ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కాలు విరిగింది.

ఎలా జరిగింది?

స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లిన మ్యాక్సీ.. తన ఫ్రెండ్‌తో కలిసి పరుగు తీస్తూ కింద పడ్డాడట. ఈ సమయంలో కాలుకు ఏదో తగలడంతో కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతని కాలు ఎముక విరిగిందని ఆస్ట్రేలియా సెలెక్టర్లు వెల్లడించారు. మ్యాక్సీ కాలుకు ఆపరేషన్ జరిగిందని, కాకపోతే ఎప్పుడు కోలుకుంటాడో అప్పుడే చెప్పలేమని ఆసీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.

ఇంగ్లండ్ సిరీస్‌కు దూరం

ఈ గాయం కారణంగా గురువారం నాడు మొదలయ్యే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌లో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఆడటం లేదు. అలాగే గాయం తీవ్రతను చూస్తుంటే ఈసారి బిగ్ బ్యాష్ లీగ్ మొత్తానికి అతను దూరమయ్యేలా ఉన్నాడని వైద్యులు అంటున్నారు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి మ్యాక్స్‌వెల్‌కు చాలా సమయం పడుతుందని చెప్పారు. దీంతో ఇంగ్లండ్ సిరీస్‌లో అతని స్థానాన్ని సీన్ ఆబాట్‌తో భర్తీ చేస్తున్నట్లు సెలెక్టర్లు తెలిపారు. తర్వాత కూడా మ్యాక్సీ కోలుకోకపోతే.. భారత్‌లో జరిగే టెస్టు సిరీస్‌లో కూడా అతను ఆడటం కష్టమేనట.

ఈ గాయాలేంట్రా బాబూ..?

టీ20 ప్రపంచకప్ ముందు నుంచి ప్రపంచంలోని దాదాపు అన్ని జట్లను ఈ గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. భారత్‌లో బుమ్రా, జడ్డూ గాయాలతో ఈ టోర్నీ ఆడలేదు. ఇంగ్లండ్‌లో జానీ బెయిర్‌స్టో గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డాడు. ఆస్ట్రేలియాకే చెందిర జోష్ ఇంగ్లిస్ కూడా గోల్ఫ్ ఆడుతూనే గాయపడి ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ కూడా ప్రపంచకప్ ముందు గాయపడి, టోర్నీ నాటికి ఎలాగో కోలుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Sunday, November 13, 2022, 12:41 [IST]
Other articles published on Nov 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+