For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డేలకు స్టార్ క్రికెటర్ వీడ్కోలు

Glenn Maxwell ODI Retirement: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్లుకు రిటైర్మెంట్ దశ ఉంది. రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌ను విడిచిపెట్టాడు. ఆ తర్వాత శ్రీలంకకు చెందిన ఏంజెలో మాథ్యూస్ కూడా టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20లకు అందుబాటులో ఉంటానని గ్లెన్ మ్యాక్స్‌వెల్ తెలిపాడు. 36 ఏళ్ల గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2012లో ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2015, 2013 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కూడా అతను ఉన్నాడు. అయితే ప్రస్తుతానికి మ్యాక్సీ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతూనే ఉంటాడు.

ప్రపంచ కప్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్
2023 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్డే చరిత్రలోనే గ్లెన్ మ్యాక్స్‌వెల్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాకు ఆఫ్ఘన్ జట్టు 292 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జట్టులోని 7 మంది బ్యాటర్లు 91 పరుగులకే ఔటయ్యారు. ఇక్కడి నుంచి ఆసీస్ ఓటమి ఖాయం అనిపించింది కానీ మ్యాక్స్‌వెల్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 128 బంతుల్లో 201 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అతను ఆ మ్యాచ్‌లో నడవలేకపోయినా జట్టును విజయపథంలో నడిపించాడు.

Glenn Maxwell Announces Retirement from ODIs Continues with T20s

ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలోనే నిర్ణయం తీసుకున్నాడట..
గ్లెన్ మ్యాక్స్‌వెల్ మార్చిలోనే వన్డేల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీకి 2027 ప్రపంచకప్ ఆడగలనని తాను అనుకోవడం లేదని చెప్పాడు. తన స్థానంలో రాబోతున్న ఆటగాళ్లు 2027 ప్రపంచ కప్ కోసం ప్రణాళికలు వేయడం ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని తాను భావిస్తున్నట్లు మ్యాక్సీ అప్పుడే చెప్పాడట.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డే కెరీర్
గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన 13 ఏళ్ల వన్డే కెరీర్‌లో 149 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 33.81 సగటు, 126.70 స్ట్రైక్ రేట్‌తో 3390 పరుగులు చేశాడు. ఈ సమయంలో 4 సెంచరీలు, 23 అర్దసెంచరీలు చేశాడు. బౌలింగ్‌లో 77 వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ బెస్ట్ 40 పరుగులకు 4 వికెట్లు.భారత్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డే కెరీర్‌లో చివరి మ్యాచ్. మార్చి 4న దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో, మాక్స్‌వెల్ 7 పరుగులు చేసిన తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

Story first published: Monday, June 2, 2025, 12:24 [IST]
Other articles published on Jun 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+