ఇండియన్ గర్ల్‌తో మ్యాక్స్‌వెల్ ఎంగేజ్‌మెంట్!!

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ తన చిరకాల ప్రేయసీ, భారత సంతతికి చెందిన విని రామన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాక్సీనే బుధవారం వెల్లడించాడు. విని రామన్‌తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.

విని రామన్ ఎవరంటే?

ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్‌లో స్థిర పడ్డ భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి విని రామన్. ఆమె ఓ ఫార్మాసిస్ట్. తమిళనాడుకు చెందిన ఆమె పూర్వీకులు ఆస్ట్రేలియాలో స్థిరపడినట్లు తెలుస్తోంది.

గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జోడీ ప్రేమ వ్యవహారం 2017లో తొలిసారి ప్రపంచానికి తెలిసింది. ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్-2019 కార్యక్రమానికి కూడా మ్యాక్సీ తన ప్రేయసీ విని రామన్‌తోనే హాజరయ్యాడు. చాలా సార్లు వారి ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఫొటోలు కూడా షేర్ చేశారు. ఇక బుధవారం నిశ్చితార్థం చేసుకున్న ఈ జోడీకి ఆస్ట్రేలియా క్రికెటర్లు, అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. సహచర ఆటగాడైన క్రిస్ లిన్.. కంగ్రాట్స్ బిగ్ బాయ్.. అని విషేస్ తెలిపాడు. అయితే పెళ్లాప్పుడా? అనే విషయాన్ని మాత్రం మాక్సీ-వినీ జోడీ వెల్లడించలేదు.

మహిళల టీ20 ప్రపంచకప్‌ : న్యూజిలాండ్‌తో భారత్ ఢీ.. గెలిస్తే సెమీస్‌కు

మ్యాక్సీ మానసిక సమస్యను..

మ్యాక్సీ మానసిక సమస్యను..

విరామం లేని షెడ్యూల్ కారణంగా మానసిక సమస్యలకు గురైన మ్యాక్స్‌వెల్ క్రికెట్‌కు నిరవధిక విరామన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తనకు మానసిక సమస్య ఉందని మొదట గుర్తించింది కూడా తన గర్ల్ ఫ్రెండ్ విని రామనేనని అప్పట్లో మ్యాక్సీ తెలిపాడు. ‘మానసిక సమస్య గురించి నేను ఎవరితోనూ చెబుతుంటే నా పార్టనర్‌ విశ్రాంతి తీసుకోమని చెప్పింది. నా సమస్యను గుర్తించిన మొదటి వ్యక్తి నా పార్ట్‌నరే. ఇప్పుడు నా భుజాలపై నుంచి భారీ భారం దిగినట్లు ఉంది. నా సమస్యను అర్థం చేసుకుని నాకు విశ్రాంతినిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ విక్టోరియా మరియు (మెల్బోర్న్) స్టార్స్‌కు నేను నిజంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను.' అని బిగ్‌బాష్ లీగ్‌కు ముందు మ్యాక్స్‌వెల్ మీడియాకు తెలిపాడు.

చహల్, రోహిత్ కోతి వేశాలు.. ఒక తన్ను తన్నిన ఖలీల్ (వైరల్ వీడియో)

నెంబర్ 2..

నెంబర్ 2..

ఒకవేళ ఈ జోడీ ఒక్కటైతే భారత అమ్మాయిని పెళ్లాడిన రెండో ఆసీస్ క్రికెటర్​గా మ్యాక్సీ నిలవనున్నాడు. ఇంతకు ముందు షాన్​ టైట్ భారత యువతినే పెళ్లాడాడు. 2014 ఐపీఎల్ సమయంలో మాషుమ్ సింఘాను కలిసిన టైట్ అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు.

ఐపీఎల్‌తో రీ ఎంట్రీ..

ఐపీఎల్‌తో రీ ఎంట్రీ..

ప్రస్తుతం గాయంతో విశ్రాంతిలో ఉన్న ఈ ఆసీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. వాస్తవానికి సౌతాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌తోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌‌లోకి పునరాగమనం చేయాలనుకున్న మ్యాక్సీ.. ఎడమ ఎల్బో సర్జరీ కారణంగా 6-8 వారాల విశ్రాంతి అవసరం కావడంతో ఆస్ట్రేలియా టీ20 జట్టుకు ఎంపిక కాలేకపోయాడు. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాక్సీని వేలంలో రూ.10.75 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, February 26, 2020, 18:36 [IST]
Other articles published on Feb 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X