For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాక్సీ మాస్ ఇన్నింగ్స్.. స్టొయినిస్ ఊచకోత (వీడియో)

బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ ఏడు వికెట్ల‌తో ఘన విజయం సాధించింది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. అనంతరం మెల్‌బోర్న్ మూడు వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అడిలైడ్‌కు శుభారంభం దక్కింది. షార్ట్ (25; 20 బంతుల్లో)తో కలిసి కెప్టెన్ మాథ్యూ (56; 32 బంతుల్లో) ఆది నుంచే దూకుడుగా ఆడారు. పవర్ ప్లే ఆఖరి ఓవర్‌లో షార్ట్ ఔటైనా వన్‌డౌన్‌లో వచ్చిన క్రిస్ లిన్ (83*; 42 బంతుల్లో)తో కలిసి మాథ్యూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. అయితే అర్థశతకం సాధించిన వెంటనే మాథ్యూ పెవిలియన్‌కు చేరాడు.

Glenn Maxwell and Marcus Stoinis play massive innings to lead Melbourne Stars to victory

మరో ఎండ్‌లో ఉన్న క్రిస్ లిన్ ఆఖరి వరకు నిలబడి బౌండరీలతో హోరెత్తించాడు. హోస్ (14), ఓవర్టన్ (19) కలిసి మెల్‌బోర్న్‌కు భారీ టార్గెట్‌ను నిర్దేశించాడు. మాక్స్‌వెల్ రెండు వికెట్లు, జోయెల్, కోరి చెరో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ థామస్ (8) మూడో ఓవర్‌లోనే ఔటయ్యాడు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన వెబ్‌స్టర్ (66; 48 బంతుల్లో)తో కలిసి డేనియల్ (50; 26 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు సాధికారికంగా ఆడుతూ అర్ధశతకాలు సాధించారు. డేనియల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్ (28; 17 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మాక్సీ ఔటైనా సమయానికి మెల్‌బోర్న్ విజయం కోసం చివరి ఆరు ఓవర్లలో 69 పరుగులు చేయాల్సి ఉంది. ఈ తరుణంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టొయినిస్ (55; 19 బంతుల్లో) చెలరేగాడు. సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చి హాఫ్ సెంచరీని సాధించాడు.

Story first published: Sunday, December 31, 2023, 19:41 [IST]
Other articles published on Dec 31, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+