హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 124 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
దీంతో ఐసీసీ టోర్నీల్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై భారత్ తన విజయ పరంపరను కొనసాగించినట్లు అయింది. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఆ స్థాయి మేరకు అద్భుత ప్రదర్శన చేస్తోంది.

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఆ జట్టు ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్ల ఆట తీరుపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు పాక్‌పై విజయం సాధించిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ అభిమానులు కన్నేశారు. కోహ్లీని తమకు అప్పగించి, దానికి బదులుగా పాకిస్థాన్ టీమ్‌ను ఓ ఏడాది పాటు తీసుకువెళ్లాలంటూ ఆ దేశ మహిళా జర్నలిస్టు నజరానా గఫర్ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.
అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియాపై గఫర్ ప్రశంసల వర్షం కురిపించింది. అయితే ఆమె చేసిన ట్వీట్‌పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాశ్మీర్‌ను, కోహ్లీని మీరు తీసుకెళ్లలేరంటూ భారత అభిమానులు ట్వీట్లు చేశారు.