Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : గిల్ బ్యాటింగ్ సచిన్‌లా ఉంటుంది.. తేల్చిచెప్పిన మాజీ లెజెండ్

Gill bats like Sachin says veteran batter Dinesh Karthik

టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో కూడా సూపర్ సెంచరీతో చెలరేగాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో గిల్‌కు అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో మూడో టెస్టులో కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టి గిల్‌కు అవకాశం ఇచ్చారు. ఆ మ్యాచ్‌లో గిల్ పెద్దగా రాణించలేదు. అయితే నాలుగో టెస్టులో మాత్రం తనకు దక్కిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.

గిల్ సూపర్ సెంచరీ..

గిల్ సూపర్ సెంచరీ..

తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన కమాండింగ్ చూపించిన గిల్.. స్వదేశంలో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. అతను 128 పరుగులు చేసి అభిమానులతోపాటు నిపుణుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో గిల్ బ్యాటింగ్ గురించి వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ బ్యాటింగ్ చూస్తుంటే క్రికెట్ దేవుడు సచిన్ బ్యాటింగ్ గుర్తొస్తోందని డీకే చెప్పాడు. 'సచిన్, గిల్ బ్యాటింగ్ స్టైల్‌లో టెన్నికల్‌గా చాలా పోలికలు ఉన్నాయి. వీళ్లిద్దరూ క్రీజులో చాలా టాల్‌గా నిలబడతారు. సచిన్ అంత ఎత్తు కాకపోయినా క్రీజులో మాత్రం టాల్‌గా నిలబడి, బంతి పై నుంచే ఆడతాడు' అని వివరించాడు.

గిల్ షాట్ చాలా స్పెషల్..

గిల్ షాట్ చాలా స్పెషల్..

అచ్చం అలాగే గిల్ కూడా క్రీజులో టాల్‌గా నిలబడి బంతిని పైనుంచి ఆడతాడని చెప్పాడు. అంతేకాదు, సచిన్ లాగే హై హ్యాండ్స్‌తో ఆడుతూ వెనకడుగు వేసి వెయిట్ చేయడం గిల్ ట్రిగ్గర్ మూమెంట్ కూడా అన్నాడు. 'ఇలా ఆడటం చూస్తే ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంటుందేమో అని డౌట్ వస్తుంది. ఎంత వేగంగా బ్యాటును కిందకు తీసుకొస్తాడో చూడండి. గిల్ స్పెషాల్టీ అదే' అని విశ్లేషించాడు. అలాగే గిల్ ఆడే కట్ షాట్ కూడా స్పెషల్ అని డీకే చెప్పాడు. సెహ్వాగ్, సంగక్కర వంటి లెజెండ్స్ కూడా స్క్వేర్ కట్ ఆడతారని, కానీ గిల్ షాట్ వీరితో పోలిస్తే చాలా స్పెషల్‌గా ఉంటుందని అన్నాడు.

ఆ షాట్ ఫీలింగే వేరు..

ఆ షాట్ ఫీలింగే వేరు..

గిల్ ఆడే షాట్ స్క్వేర్ కట్‌లా కాకుండా, షార్ట్ ఆర్మ్ జ్యాబ్‌లా ఉంటుందని డీకే అభిప్రాయపడ్డాడు. బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఈ షాట్ ఆడతాడని గుర్తుచేశాడు. సెహ్వాగ్, సంగక్కర ఇదే షాట్ ఆడాల్సి వస్తే గల్లీ ప్రాంతంలోకి ఆడేవాళ్లని వివరించాడు. 'సాధారణంగా బంతిని బాగా కట్ చేసే బ్యాటర్లను చూస్తే.. ఈ షాట్‌తో బంతిని స్క్వేర్ ఫీల్డర్ వెనక్కు పంపుతారు. కుమార్ సంగక్కర, వీరేంద్ర సెహ్వాగ్ ఆట చూస్తే.. గల్లీకి అటూ ఇటూ ఈ షాట్ ఆడతారు. వాళ్ల రేంజ్ కూడా అద్భుతంగా ఉంటుంది' అని తెలిపాడు. కానీ గిల్ షాట్ భిన్నంగా ఉంటుందని, దాని చప్పుడు కూడా చాలా క్రిస్ప్‌గా ఉంటుందని వెల్లడించాడు. ఆ షాట్ ఆడితే ఆ ఫీలింగే వేరుగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

Story first published: Sunday, March 12, 2023, 16:23 [IST]
Other articles published on Mar 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+