GilChrist : రిషబ్ పంత్ చాలా ధైర్యవంతుడు అతన్ని తుది జట్టులో ఉంచాల్సిందే..! కావాలంటే డీకేను తప్పించండి

వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ప్రధానంగా కొన్ని ఆందోళనలున్నాయి. అందులో తుది జట్టులో దినేష్ కార్తీక్‌ను ఆడించాలా లేదా రిషబ్ పంత్‌ను బరిలోకి దించాలా అనేది కీలకమైన ఆందోళన.
ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఈ హాట్ టాపిక్‌పై తన అభిప్రాయాన్ని వెల్డించాడు. ఆల్ టైమ్ అత్యుత్తమ వికెట్ కీపర్ కం బ్యాటర్‌లలో గిల్ క్రిస్ట్ ఒకడనే సంగతి తెలిసిందే. క్రీజులో దూకుడుగా, ధైర్యంగా ఆడే రిషబ్ పంత్‌ను తుది జట్టులో తప్పకుండా చేర్చుకోవాలని గిల్‌క్రిస్ట్ సూచించాడు. పంత్, దినేశ్ కార్తీక్ ఇద్దరికీ ఒకేసారి జట్టులో చోటు దక్కితే మరింత బాగుంటుందన్నాడు.

దినేస్ కార్తీక్ బహుముఖ ప్రజ్ఞశాలి
'రిషబ్ పంత్ మస్తు ధైర్యవంతుడు. అతను కనబర్చే తెగువ, బౌలర్లపై ఎటాకింగ్ చేసే విధానం తదితర లక్షణాలను బట్టి భారత తుది లైనప్‌లో పంత్ తప్పనిసరిగా ఉండాలని నేను భావిస్తున్నాను. వీలయింతే పంత్, దినేష్ కార్తీక్ ఇద్దరు ఉంటే బాగుంటుంది. కానీ వీరద్దరిలో ఒకరినే ఉంచాల్సొస్తే మాత్రం రిషబ్ పంతే మస్తు బెటర్ అని నేను అనుకుంటున్నా' అని గిల్‌క్రిస్ట్ ఐసీసీ రివ్యూలో తెలిపాడు. చెప్పాడు. దినేష్ కార్తీక్ ఫినిషింగ్ సామర్థ్యాన్ని కూడా గిల్లీ ప్రత్యేకం ప్రస్తావించాడు.'ఇద్దరూ (పంత్, దినేష్ కార్తీక్) తుది జట్టులో ఉంటే చాలా బాగుంటుంది. అలాంటి జట్టు లైనప్ చూడటం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. భారత జట్టు మేనేజ్ మెంట్ ఆ పని చేయగలదని నేను అనుకుంటున్నాను. దినేష్ కార్తీక్ యొక్క బహుముఖ ప్రజ్ఞశాలి. అతను బ్యాటింగ్ ఆర్డర్‌లో అగ్రస్థానంలో ఆడగలడు.. లోయర్ ఆర్డర్లో ఆడగలడు. అతను తన కెరీర్‌లో అన్ని ఆర్డర్లో ఆడాడు. ప్రస్తుతం అతను మంచి టచ్ గేమ్‌ను కలిగి ఉన్నాడు' గిల్లీ తెలిపాడు.

నేనే సెలెక్టర్ అయితే పంత్ పక్కా తుది జట్టులో..
ఇకపోతే ఇటీవల ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ కూడా రిషబ్ పంత్‌ను ఆకాశానికెత్తేసిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ భారత జట్టు భవిష్యత్తు ఆశాకిరణం అని, దీర్ఘకాలంలో అతను గొప్ప ప్లేయర్‌గా ఎదగగలడంటూ సపోర్టివ్ వ్యాఖ్యలు చేశాడు. తాను సెలెక్టర్‌గా ఉండుంటే రిషబ్ పంత్‌ను తుది జట్టులో పక్కా ఉంచుతానని మాథ్యూ హేడెన్ పేర్కొన్నాడు. అతను పరుగులు చేయడంలో విఫలమైనప్పటికీ అతనికి మద్దతు ఇవ్వాలని హేడెన్ తెలిపాడు. వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన పంత్ ప్రతి అంశంలో అత్యుత్తమంగా ఉన్నాడని చెప్పాడు.

టీ20 ఫార్మాట్లో రాణించలేకపోతున్న పంత్
ఇకపోతే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20లో పంత్ ప్లేయింగ్ 11లో లేడు. అతన్ని తప్పించి దినేష్ కార్తీక్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. టీ20ఫార్మాట్‌లో పంత్ తన సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. అందువల్లే అతను టీ20లకు సరిపోడంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పంత్ ఈ ఏడాది 17 టీ20ల్లో 25.91సగటుతో కేవలం 311పరుగులు మాత్రమే చేశాడు. 25ఏళ్ల పంత్ టీ20ల్లో నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఇటీవల ఆసియా కప్ 2022లో పంత్ కేవలం మూడు ఇన్నింగ్స్‌లలో 51పరుగులు మాత్రమే చేయగలిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications