Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెండూల్కర్ కు గిల్ క్రిస్ట్ ఫోన్

Adam Gilchrist
ముంబయి: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ శుక్రవారంనాడు భారత బాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ కు ఫోన్ చేశాడు. తాను సచిన్ టెండూల్కర్ నిజాయితీని ప్రశ్నించినట్లు ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు రావడంతో ఆయన ఈ ఫోన్ చేసి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను ఆస్ట్రేలియా మీడియా వక్రీకరించిందని ఆయన టెండూల్కర్ తో చెప్పారు.

భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నిజాయితీని ఆస్ట్రేలియా జట్టు మాజీ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ వ్యాఖ్యానించినట్లు ఆస్ట్రేలియా మీడియా రాసింది. తన జీవితంపై రాసిన పుస్తకంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు మీడియా రాసింది. ఈ వార్తల వివరాలు ఇలా ఉన్నాయి - సిడ్నీ టెస్టులో హర్భజన్-సైమండ్స్ మధ్య జాతి వివక్షా పూరిత వ్యాఖ్యల వివాదంలో సచిన్ అనుసరించిన పాత్ర క్రికెట్ ప్రపంచంలో అతడి నిజాయితీనే శంకించే విధంగా ఉందని గిల్‌క్రిస్ట్ తన తాజా జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. ఈ వివాదంలో అంతిమంగా నష్టపోయింది, మసక బారింది సచిన్ ప్రతిష్టే అని గిల్లీ తేల్చాడు. భారత, ఆస్ట్రేలియా క్రికెట్‌లో మంకీ గేట్‌లా పేరొందిన సిడ్నీ వివాదంలో హర్భజన్‌పై ఐసీసీ క్రమశిక్షణా కమిటీ విచారణ సందర్భంగా సచిన్ ఇచ్చిన సాక్ష్యం కేవలం ప్రహసన ప్రాయంగా ఉందని గిల్లీ తన పుస్తకంలో రాయబోతున్నట్లు ఆస్ట్రేలయా మీడియా వార్తలు ప్రచురించింది. క్రికెట్ ప్రపంచం మొత్తంగా సైమండ్స్‌పై హర్భజన్ చేసిన జాతివివక్షా పూరిత వ్యాఖ్యలపై తీవ్రంగా యోచిస్తున్న సమయంలో సచిన్‌తో సహా భారత్ క్రికెటర్లు మొత్తంగా హర్భజన్ కొమ్ముకాశారని గిల్లీ పేర్కొన్నాడు.

మైదానంలో హర్భజన్, ఆసీస్ ఆటగాడు సైమండ్స్ గురించి కోతి అని వ్యాఖ్యానించినట్లు తనకు వినబడలేదని సచిన్ మొదట్లో చెప్పడం చాలా హేతుబద్ధంగా కనిపించిందని గిల్లీ చెప్పాడు. ఎందుకంటే సచిన్ ఆ ఘటన జరిగిన సమయంలో వారికి దూరంగా ఉన్నందున అతడికి వారి మాటలు ఏవీ వినబడే అవకాశం లేదని గిల్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే తర్వాత హర్భజన్ తనపై క్రమశిక్షణా చర్యకు వ్యతిరేకంగా అప్పీల్ చేసుకున్నప్పుడు సాక్ష్యం చెప్పిన సచిన్ మాట మార్చాడని, మైదానంలో హర్భజన్ ప్రయోగించిన ఓ పదాన్ని ఆసీస్ ఆటగాళ్లు కోతి అనే అర్థంలో తీసుకున్నారని సచిన్ ఐసీసీ కమిటీ ముందు చెప్పాడని గిల్లీ వాపోయాడు.

ఆ ఘటనలో హర్భజన్ తప్పు చేశాడన్నదే తన అభిప్రాయమని చెప్పిన గిల్లీ, తర్వాత భజ్జీపై చర్య తీసుకుంటే ఆసీస్ పర్యటనను రద్దు చేసుకుంటామని భారత్ బెదిరించడం చాలా హేయమైన చర్యగా పేర్కొన్నాడు. క్రికెట్ ఆటపట్ల ఇరుజట్ల ఆటగాళ్ల వైఖరిలో కూడా అనేక వ్యత్యాసాలు ఉన్నాయని గిల్‌క్రిస్ట్ రాశాడు. ఆసీస్‌కు సబంధించినంతవరకు తాము కష్టపడి ఆడతామని తర్వాత చేతులు కలుపుకున్నాక మైదానంలోనే అన్నీ వదిలివేస్తామని గిల్లీ చెప్పాడు. అయితే కొంతమంది ఆసీస్ ప్రత్యర్థులు అలా చేయలేరని పేర్కొన్నాడు.
Story first published: Friday, October 24, 2008, 16:44 [IST]
Other articles published on Oct 24, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+