
ఇండియన్ క్రికెటర్లు విదేశీ టీ20 లీగ్‌లలో ఆడితే బాగుంటుందని ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు. ప్రస్తుతం విదేశీ టీ20 లీగ్‌లలో ఆడడానికి బీసీసీఐ భారత క్రికెటర్లకు పర్మిషన్ ఇవ్వదనే విషయం తెలిసిందే. ఈ విషయమై గిల్‌క్రిస్ట్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ పెద్ద మనసు చేసుకుని ఇండియన్ క్రికెటర్లు సైతం విదేశీ టీ20లీగ్‌లలో ఆడేలా చూడాలన్నాడు. ఎందుకంటే భారత ఆటగాళ్లకు మంచి క్రేజ్ ఉందని, ఫారెన్ దేశాల టీ20ల లీగ్‌ల్లో వారు ఆడితే వారితో పాటు ఇండియాకు మేలేనని అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్, వెస్టిండీస్లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫారెన్ లీగ్స్‌లో భారత క్రికెటర్లు పాల్గొంటే.. ఐపీఎల్ బ్రాండ్ విలువ ఓ రేంజులో పెరుగుతుందన్నాడు. అలాగే బీసీసీఐకి సైతం ప్రపంచవ్యాప్తంగా రికగ్నిషన్ లభిస్తుందని చెప్పాడు.
అలాగే ఐపీఎల్‌ను కూడా గిల్ క్రిస్ట్ ఆకాశానికెత్తేశాడు. తాను ఐపీఎల్లో ఆరు సీజన్లు ఆడానని.. ఆ అనుభవం ద్వారా చెబుతున్న భారత క్రికెటర్లకు వీదేశీ లీగ్‌లలో సూపర్ క్రేజ్ ఉంటుంది. ఐపీఎల్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచే టీ20 లీగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. దాన్ని నిర్వహిస్తున్న బీసీసీఐని ప్రశంసించాడు. ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. అన్ని విదేశీల లీగ్‌లలో జట్లను కొనేసుకుంటూ తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటున్నాయని, ప్లేయర్ల ట్యాలెంట్‌ను తమకు అనుగుణంగా చేసుకుంటున్నాయని, అది క్రికెట్ ప్రపంచానికి మంచిది కాదని గిల్ క్రిస్ట్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. గిల్లీ చేసిన ఆ వ్యాఖ్యలు సైతం నెట్టింట వైరలయ్యాయి.
ఆ మధ్య బిగ్‌బాష్ లీగ్‌లో ఆడ్డానికి అమెరికాకు షిఫ్ట్ అయిన ఉన్ముక్త్ చంద్ అనే ప్లేయర్.. అక్కడి నుంచి బిగ్ బాష్ లీగ్‌లో ఎంట్రీ పొందాడు. భారత క్రికెటర్‌గా విదేశీ టీ20లీగ్‌లు ఆడడం ప్రస్తుతం నిషేధం.