For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సామ్‌.. ఇంటికెళ్లి బాగా చదువుకో! చాక్లెట్లు తినకుండా.. జనరల్‌ నాలెడ్జ్‌ పెంచుకో! రైనా ట్రోల్స్!

Ghar jaake padhai karna: Twitterai hilarious trolls on Suresh Raina and Sam Currans Photo

హైదరాబాద్: సోషల్‌ మీడియా పుణ్యమాని ప్రతిదీ జనాలకు తక్కువ సమయంలో చేరువవుతోంది. ట్రోల్స్‌, మీమ్స్‌, కామెంట్స్‌ సంగతయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సెలబ్రిటీలకు సంబందించిన పోస్టులు, ఫొటోలు, మీమ్స్‌ అయితే క్షణాల్లో వైరల్ అవుతాయి. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 సీజన్‌ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) స్టార్ ఆటగాళ్లు సురేశ్‌ రైనా, సామ్‌ కరన్‌ల మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. వారిద్దరు మాట్లాడుకున్న ఓ ఫొటోపై క్రికెట్ అభిమానులు సరదా మీమ్‌లు సృష్టించి నవ్వులు పూయిస్తున్నారు.

సామ్.. ఇంటికెళ్లి బాగా చదువుకో:

ఐపీఎల్ 2021లో భాగంగా ఓ మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు సురేశ్‌ రైనా, సామ్‌ కరన్‌లు మాట్లాడుకున్నారు. దీనికి సంబందించిన ఫొటో ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. ఆ ఫొటోలో సామ్‌ దిగాలుగా కూర్చుని ఉంటే.. రైనా అతడి చేతిని పట్టుకుని ఓదారుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోటోను షేర్ చేసిన నెటిజన్లు.. సామ్‌‌కు రైనా జాగ్రత్తలు చెబుతున్నట్లు మీమ్స్‌ క్రియేట్ చేశారు. 'సామ్.. ఇంటికెళ్లి బాగా చదువుకో. ఎవరైనా అపరిచితులు చాక్లెట్ ఇస్తే తీసుకోకు' అంటూ కరన్‌తో రైన్ అంటున్నట్లు ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. దానికి సామ్‌ సరేనన్నట్లు తల ఊపుతున్నట్లుగా అనిపించింది.

మీమ్స్‌ చదువుతూ సామ్ ఆనందం:

ఈ ఫోటో చూసిన సామ్‌ కరన్‌ కూడా నవ్వేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కరన్‌పై ఉన్న ట్రోల్స్‌, మీమ్స్‌ అన్ని జత చేసి అతడి మొబైల్‌కు పంపింది. వాటిని చదువుతూ సామ్ ఆనందం వ్యక్తం చేశాడు. దీనిపై సురేష్ రైనా తన ట్విటర్‌లో స్పందిస్తూ.. సూపర్‌ అంటూ లాఫింగ్‌ ఎమోజీతో పాటు లాఫింగ్‌ సింబల్‌ను ట్యాగ్‌ చేశాడు. చెన్నై జట్టలో అందరికంటే చిన్నవాడు కారనే. అతడి క్లీన్ షేవ్, నీట్ క్రాఫ్ లుక్స్ కూడా అతడిని మరింత చిన్నవాడిగా చూపిస్తాయి. దీంతో అతడి గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్ షేర్ చేస్తున్నారు.

ఆరు మ్యాచుల్లో 9 వికెట్లు:

ఆరు మ్యాచుల్లో 9 వికెట్లు:

చెన్నై గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ను మరిపిస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌ 13వ సీజన్‌కు దూరంగా ఉన్న సురేష్ రైనా.. ఐపీఎల్‌ 14వ సీజన్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లాడిన రైనా.. 6 ఇన్నింగ్స్‌లు కలిపి 126 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్‌ సెంచరీ కూడా ఉంది. ఇక సామ్‌ కరన్‌ ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడి 9 వికెట్లు తీశాడు. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముంబైపై అందరూ భారీగా పరుగులు సమర్పించుకుంటున్న సమయంలో సామ్ మాత్రమే కాస్త మెరుగ్గా బంతులు విసిరాడు. 219 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై చివరి బంతికి ఓడిన విషయం తెలిసిందే.

Story first published: Friday, May 7, 2021, 20:27 [IST]
Other articles published on May 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+