Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ ఇచ్చిన గిప్ట్ అది: కారు వార్తలపై దీపా స్పందన

న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా బహుమతిని అందుకోవడం చాలా గొప్ప విషయమని అలాంటి కారుని తిరిగిచ్చే ప్రసక్తే లేదని జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తేల్చి చెప్పింది. సచిన్ చేతుల మీదుగా అందుకున్న కారుని తిరిగి దీపా ఇవ్వనుందంటూ వస్తున్న వార్తలపై గురువారం ఆమె స్పందించింది.

రియో ఒలింపింక్స్ ప్రదర్శన ఆధారంగా తాను సచిన్ చేతుల మీదుగా అందుకున్న బీఎండబ్ల్యూ కారును భరించే శక్తి లేదని, ఆ కారుని తిరిగి ఇచ్చేయనున్నట్లు వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేసింది. ఆ కారును తిరిగి ఇచ్చే ఆలోచన తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంపై గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.

సచిన్ నుంచి ఏ గిఫ్ట్ అందుకున్న అది గొప్ప విషయం

సచిన్ నుంచి ఏ గిఫ్ట్ అందుకున్న అది గొప్ప విషయం

'ఆ కారును సచిన్ చేతులు మీదుగా అందుకున్నా. సచిన్ నుంచి ఏ గిఫ్ట్ అందుకున్న అది నాకు గొప్ప విషయమే. అతని నుంచి అందుకున్న గిఫ్ట్‌ను తిరిగిచ్చే ఆలోచన నాకు లేదు' అని దీపా పేర్కొంది. అగర్తలాలో బీఎండబ్యూ షోరూం లేదన్న విషయాన్ని మాత్రమే తాను తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు. దీనిపైనే తాను హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌తో మాట్లాడినట్లు పేర్కొంది.

రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ

రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ

రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చినందుకు గాను దీపాకు క్రికెట్ దిగ్గజం సచిన్ చేతులు మీదుగా దీపాతో పాటు, సింధు, సాక్షిలకు బీఎండబ్ల్యూ కారును హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీ చాముండేశ్వరినాథ్‌ బహూకరించిన సంగతి తెలిసిందే.

తిరిగి తీసుకునేందుకు చాముండేశ్వరినాథ్ విముఖత

తిరిగి తీసుకునేందుకు చాముండేశ్వరినాథ్ విముఖత

దీపా నుంచి తిరిగి కారుని తీసుకునేందుకు కారును స్పాన్సర్ చేసిన చాముండేశ్వరినాథ్ కూడా విముఖత వ్యక్తం చేశారు. అంత అట్టహాసంగా సచిన్ చేతుల మీదుగా ప్రదానం చేసిన గిప్ట్‌ని ఇంత చిన్న కారణం చేత తిరిగి తీసుకోకూడదనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లుగా తెలుస్తోంది.

అగర్తలాలో బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్‌కు యత్నాలు

అగర్తలాలో బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్‌కు యత్నాలు

బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్ అగర్తలాలో పెట్టించేందుకు ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. సర్వీస్ సెంటర్ విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతే కారు తీసుకోవాలా? వద్దా అనే విషయంపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. ఈ విషయమై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కారుకు బదులుగా దీపా కర్మార్కర్ డబ్బు అడిగిందంటూ తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం తగదన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+