Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండండి: ఆటగాళ్లకు కోచ్ రవిశాస్త్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు

 Get ready to attack the fresh challenges ahead: Ravi Shastris New Year message to Team India

హైదరాబాద్: భారత జట్టులోని ఆటగాళ్లకు హెడ్ కోచ్‌ రవిశాస్త్రి ట్విట్టర్‌ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 సంవత్సరంలో చాలా గొప్పగా రాణించారనీ, నూతన సంవత్సరం 2020లో కొత్త సవాళ్లను స్వీకరించి, ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ మేరకు తన ట్విట్టర్‌లో ఆటగాళ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విశ్రాంతి కాలాన్ని ఎంజాయ్‌ చేయాలన్న రవిశాస్త్రి.... వచ్చే ఏడాది 2020 విజన్‌తో గొప్ప విజయాలను సాధించాలని అన్నారు. ఇక, రవిశాస్త్రి కోచింగ్‌లో టీమిండియా అద్భుతమైన విజయాలను సాధించిన సంగతి తెలిసిందే.

మూడు ఫార్మాట్లలోనూ ఘనవిజయాలు సాధించింది. ఈ ఏడాది ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించింది. ఐసీసీ ప్రకటించిన వన్డే, టెస్టు ఫార్మాట్లలో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. ఇక, క్రికెటర్లు సైతం ఈ ఏడాది వ్యక్తిగత ప్రదర్శనలో అనేక రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు.

Story first published: Tuesday, December 31, 2019, 18:50 [IST]
Other articles published on Dec 31, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+