లారా సేవలు అవసరం: విండిస్ బోర్డుకు వార్న్ సూచన
సిడ్నీ: పేలవ ప్రదర్శనతో నానాటికీ దిగజారిపోతున్న వెస్టిండీస్ క్రికెట్‌ను బ్రతికించుకోవాలంటే జట్టుకు ఆ దేశ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా సేవలు అవసరమని లెజెండరీ ఆస్టేలియా లెగ్ స్పిన్నర్ షేన్‌వార్న్ అభిప్రాయపడ్డాడు.
ఆస్టేలియాతో హోబార్ట్‌లో జరిగిన తొలి టెస్టులో వెస్టిండిస్ 212 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అనంతరం వెస్టిండిస్ ఇన్నింగ్స్‌పై మాట్లాడిన షేన్‌వార్న్ మాట్లాడుతూ గత కొంతకాలంగా వెస్టిండీస్ క్రికెట్ చాలా పేలవంగా సాగుతున్న కారణంగా లారాకు వెస్టిండీస్ జట్టులో కీలక బాధ్యత అప్పగించాలని సూచించాడు.

'ప్రస్తుత వెస్టిండీస్ జట్టుకు లారా సేవలు అవసరమని భావిస్తున్నా. ఆస్ట్రేలియాతో హోబార్ట్‌లో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ 212 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కనీసం పోరాడకుండానే విండీస్ వరుస ఓటములు చూడటం నిజంగా బాధాకరం' అని 145 టెస్టుల్లో 708 వికెట్లు తీసుకున్న వార్న్ అభిప్రాయపడ్డాడు.
'ఇలాంటి పరిస్థితుల్లో జట్టుకు లారా సూచనలు జట్టుకు కచ్చితంగా అవసరం. వెస్టిండీస్ తరపున అత్యధిక టెస్టు పరుగులు(11,953) చేయడమే కాకుండా, టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు(400 నాటౌట్), ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 501 పరుగులతో అజేయంగా ఉన్నటువంటి అరుదైన ఘనతలు లారా పేరిటే ఉన్నాయి. ఈ విషయాన్ని వెస్టిండీస్ బోర్డు గుర్తిస్తే మంచిది' అని వార్న్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications