Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింతైన స్టాన్స్‌తో నవ్వులు పూయిస్తున్న బ్యాట్స్‌మన్(వీడియో)

George Baileys Unusual Batting Stance Leaves Twitter In Splits

హైదరాబాద్: మొన్నటికి మొన్న పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్టాన్స్ చూసి క్రికెట్ ప్రపంచం నవ్వుకుంది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జార్జ్ బెయిలీ అయితే ఓ వింత స్టాన్స్‌తో నవ్వులు పూయించాడు. బౌలర్‌కు పూర్తిగా తన వీపు చూపిస్తూ అతను క్రీజులో నిల్చున్న తీరు చూసి స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సౌతాఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డుప్లెస్సి కూడా నవ్వుకున్నాడు.

ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్, సౌతాఫ్రికా మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో సౌతాఫ్రికా బౌలర్ లుంగి ఎంగిడి బౌలింగ్ చేస్తున్న సమయంలో బెయిలీ ఇలా వింతయిన స్టాన్స్ తీసుకొని ఆశ్చర్యపరిచాడు. బౌలర్‌కు వెన్ను చూపిస్తూ.. ఓ పక్కకు తిరిగి బంతి వచ్చే సమయానికి స్పందించి హిట్టింగ్ చేస్తూ వచ్చాడు.

ఈ మ్యాచ్‌లో 174 పరుగుల లక్ష్యంతో దిగిన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ టీమ్.. బెయిలీ హాఫ్ సెంచరీ సాయంతో విజయం సాధించింది. బెయిలీ తన కెరీర్‌ మొత్తంలో 90 వన్డేల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లలో మాత్రం కేవలం ఐదింటిలోనే ఆడాడు. ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు.. చెన్నై సూపర్ కింగ్స్‌కు.. రైజింగ్ పూణె సూపర్‌జెయింట్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

అన్ని స్టంప్స్‌ను బౌలర్‌కు కనిపించేలా దూరంగా నిలబడి అతడు బ్యాటింగ్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్న పాకిస్థాన్‌.. రెండో టెస్టులో మాత్రం పట్టు వదల్లేదు. యూఏఈ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ని పాకిస్థాన్ 1-0తో చేజిక్కించుకుంది. నాలుగో రోజు, శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో ఏకంగా 373 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్‌ క్రికెట్‌ చరిత్రలోనే పరుగుల తేడా పరంగా ఇదే అతి పెద్ద విజయం.

Story first published: Thursday, November 1, 2018, 12:53 [IST]
Other articles published on Nov 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+