Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: ఎలా బ్యాటింగ్‌ చేయాలో కోహ్లీని చూసి నేర్చుకోండి.. ఇంగ్లండ్ ఆటగాళ్లకు బాయ్‌కాట్‌ చురకలు!!

Geoffrey Boycott urges England Batsmen to follow Virat Kohlis On playing Spin

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ సారథి జెఫ్రీ బాయ్‌కాట్‌ ప్రశంసల వర్షం కురిపించారు. చెన్నైలో జరిగిన రెండో టెస్టులో‌ కోహ్లీ కఠిన పరిస్థితుల్లో పట్టుదలతో బ్యాటింగ్‌ చేశాడని, అతడి ఫుట్‌వర్క్‌ అద్భుతంగా ఉందని కొనియాడారు. స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఎలా బ్యాటింగ్‌ చేయాలో కోహ్లీని చూసి నేర్చుకోవాలని ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు సూచించారు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (62)తో అదరగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ ‌(106)తో కలిసి ఏడో వికెట్‌కు 96 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

కోహ్లీ పట్టుదలగా ఆడాడు:

కోహ్లీ పట్టుదలగా ఆడాడు:

బ్యాటింగ్‌కు కఠినంగా ఉన్న పిచ్‌పై విరాట్ కోహ్లీ అమోఘంగా ఆడాడని జెఫ్రీ బాయ్‌కాట్‌ ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నారు. 'భారత్‌లో ఫాస్ట్‌ పిచ్‌లు ఉండవు. అది గొప్ప విషయం. ఇక్కడ ఆడేటప్పుడు క్రీజులో కుదురుకొని షాట్లు ఎంపిక చేసుకునే వీలుంటుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ పట్టుదలగా ఆడాడు. అతడి ఫుట్‌వర్క్‌ బాగుంది. బంతి పడే లెంగ్త్‌ను కోహ్లీ బాగా అర్థం చేసుకున్నాడు. దాంతో షాట్ల ఎంపిక కూడా కచ్చితంగా ఉంది. కఠిన పిచ్‌ మీద కూడా బాగా ఆడొచ్చనే విషయాన్ని కోహ్లీ రుజువు చేశాడు' అని బాయ్‌కాట్‌ పేర్కొన్నారు.

బెయిర్‌స్టోతో కాకుండా:

బెయిర్‌స్టోతో కాకుండా:

రెండో టెస్టుకు జోస్‌ బట్లర్‌కు విశ్రాంతినిచ్చి బెన్‌ ఫోక్స్‌కు వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు అప్పగించడంపై మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్‌ విమర్శలు గుప్పించారు. 'బట్లర్‌ విశ్రాంతి కోసం భారత్‌ నుంచి ఇంగ్లండ్‌కు వచ్చాడు. అయితే అతడి స్థానాన్ని బెయిర్‌స్టోతో కాకుండా ఫోక్స్‌తో పూరించడం బాధగా ఉంది. బ్యాట్స్‌మన్‌, కీపర్‌గా బెయిర్‌స్టో ఆడటం ఇంగ్లండ్ ఛీఫ్‌ సెలెక్టర్‌ ఎడ్‌ స్మిత్‌కు ఇష్టం లేదు. అందుకే అతడు ‌ఫోక్స్‌కు అవకాశం ఇచ్చాడు' అని ఇటీవల టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్నారు. భారత పర్యటనకు ముందు శ్రీలంకతో ముగిసిన రెండు టెస్టుల్లో బెయిర్‌స్టో బాగా ఆడాడు. తొలి టెస్టులో 47, 35 (నాటౌట్).. రెండో టెస్టులో 28, 29 పరుగులు చేశాడు.

భారత్‌ పరిస్థితులపై చక్కటి అవగాహన:

భారత్‌ పరిస్థితులపై చక్కటి అవగాహన:

'శ్రీలంకలో జానీ బెయిర్‌స్టో పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రెండేళ్ల తర్వాత అతను భారతదేశ పరిస్థితులకు అలవాటు పడ్డాడు. ఇప్పుడు జానీకి అక్కడ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. స్పిన్నర్లను బాగా ఎదుర్కొంటాడు. అయినా పక్కన పెట్టారు. బెయిర్‌స్టో విషయంలో జట్టు ప్రవర్తించిన తీరుతో యాజమాన్యం సిగ్గుపడాలి' అని బాయ్‌కాట్‌ పేర్కొన్నారు. భారతదేశంలో బెయిర్‌స్టోకు మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆరు టెస్టుల్లో 40.11 సగటుతో 361 పరుగులు చేశాడు. ఉపఖండంలో అతని టెస్టు సగటు 40గా ఉంది. అంతేకాదు ఓ సెంచరీ కూడా చేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడుతున్న జానీకి.. భారత్‌ పరిస్థితులపై చక్కటి అవగాహన ఉంది.

24 నుంచి మూడో టెస్ట్:

24 నుంచి మూడో టెస్ట్:

రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమానం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈనెల 24 నుంచి అహ్మదాబాద్‌లో డే/నైట్‌ (మూడో) టెస్టు జరగనుంది. ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఆపై టీ20, వన్డే సిరీస్‌లను ఆడనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)‌ తాజాగా ప్రకటించింది. మార్చి 12 నుంచి 20 మధ్య అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Story first published: Friday, February 19, 2021, 9:51 [IST]
Other articles published on Feb 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+