For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడు వికెట్లు పడిపోయేసరికి పారిపోదామనుకున్నా..

'Genius' AB De Villiers Changed the Game, Says SA Batting Coach Benkenstein

హైదరాబాద్: అనుకున్నదాని కంటే ఆసక్తికరంగా మారింది భారత్ దక్షణాఫ్రికా తొలి టెస్టు. కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భువీ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. 13 పరుగులైనా లేకుండానే మూడు వికెట్లు తీసేశాడు. అంతే ఆ దెబ్బకి దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లకే కాదు కోచ్‌కి సైతం భయం పట్టుకుందట.

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ అయిన డేల్ బేంకింస్టీన్ పారిపోవాలనుకున్నాడట. మ్యాచ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాడు. '12 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో అసలు తర్వాతి పరుగులు ఎలా వస్తాయో అర్థం కాలేదు. ఉబెర్‌ క్యాబ్‌ తీసుకొని ఇక్కడినుంచి పారిపోవాలని అనిపించింది. అయితే మా చేతుల్లో ఆ సమయంలో సెల్‌ ఫోన్‌ లేకపోవడం వల్ల అలా చేయలేకపోయాను' అని
వ్యాఖ్యానించాడు.

ఈ మ్యాచ్ గురించి భువనేశ్వర్ కుమార్ స్పందిస్తూ తొలి టెస్టులో తాము అనుకున్నదాని కంటే 30 పరుగులు అదనంగా ఇచ్చామని అన్నాడు. ఆట ముగిసిన అనంతరం అతడు మాట్లాడుతూ... ఓవర్‌కు 4 పరుగుల రన్‌రేట్‌ అనేది టెస్టుల్లో ఎక్కువేనని పేర్కొన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అలా జరగకుండా చూడాల్సి ఉందన్నాడు.

'అయిదు వికెట్ల ప్రదర్శన మిస్‌ అయినందుకు బాధపడటం లేదు. క్యాచ్‌లు చేజారకుండా చూసుకోవాలి. ప్రత్యర్థి టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడం ఆశ్చర్యపర్చలేదు. మేం టాస్‌ నెగ్గితే బౌలింగే తీసుకునేవారం' అని వివరించాడు. మరో వైపు దక్షిణాఫ్రికా కోచ్‌ తొలి రోజు ఆట గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. అన్నాడు

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 6, 2018, 10:58 [IST]
Other articles published on Jan 6, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+