Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైడ్ బాల్ అందుకోబోయి బొక్క బోర్లా పడ్డ గేల్.. స్టంపౌట్(వీడియో)

 Gayle st Buttler b Gowtham

హైదరాబాద్: గెలవాలనే కసి, భారీ పట్టుదలతో రాజస్థాన్ జట్టు తీవ్రంగా శ్రమించి పంజాబ్‌ను ఓడించగలిగింది. ఐపీఎల్ 11లో భాగంగా మంగళవారం పంజాబ్, రాజస్థాన్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ గేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. విధ్వంసకర బ్యాట్సమన్ క్రిస్ గేల్‌ను యువ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ బోల్తా కొట్టించాడు. గౌతమ్ వేసిన బంతిని సిక్సర్ బాదేద్దామని ముందుకు వచ్చిన గేల్‌కు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చాడు.

ఆరంభంలోనే ఆటంకం

ఆరంభంలోనే ఆటంకం

జైపూర్‌లోని స్వామి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (58 బంతుల్లో 82) అద్భుతంగా ఆడాడు. అయితే లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఆరంభంలోనే ఆటంకం ఎదురైంది. మూడో ఓవర్ తొలి బంతికే క్రిస్ గేల్ స్టంపౌట్ అయ్యాడు. అది కూడా వైడ్ బాల్‌కి.

కచ్చితంగా ముందుకు వస్తాడని గమనించి

గేల్ కచ్చితంగా ముందుకు వస్తాడని గమనించిన గౌతమ్.. బంతిని దూరంగా (వైడ్) వేశాడు. వెంటనే బంతిని అందుకున్న కీపర్ బట్లర్ వికెట్లను గిరాటేశాడు. బంతిని గమనించి వెంటనే వెనక్కి వెళ్లలేకపోయిన గేల్ పిచ్‌పై పడిపోయాడు. ఈ కరేబియన్ విధ్వంసకర ఆటగాడి వికెట్ తీయగానే గౌతమ్ ఆనందానికి అవధుల్లేవు. ఈ ఆసక్తికర దృశ్యం మ్యాచ్‌ చూస్తున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

గేల్ స్టంపౌట్ కావడానికి ముందు

గేల్ స్టంపౌట్ కావడానికి ముందు

అదే ఓవర్‌లో కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌(0)ను కూడా గౌతమ్ ఔట్ చేశాడు. క్లియర్ బాల్‌కి అశ్విన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 14 పరుగులకే పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. వాస్తవానికి గేల్ స్టంపౌట్ కావడానికి ముందు బ్యాట్‌ను మార్చుకున్నాడు. కొత్త బ్యాట్‌తో దుమ్మురేపుదాం అనుకునేలోపే పెవిలియన్‌కు చేరాడు.

రెండు రోజుల క్రితం పంజాబ్‌ చేతిలో

రెండు రోజుల క్రితం పంజాబ్‌ చేతిలో

రెండు రోజుల క్రితం పంజాబ్‌ చేతిలో ఓడిన రాజస్థాన్.. మంగళవారం రాత్రి జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో గెలుపొంది ఓటమికి బదులు తీర్చుకుంది. టోర్నీలో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. ఓపెనర్ జోస్ బట్లర్ (82) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

సహకారం అందించేవారు కరువయ్యారు

సహకారం అందించేవారు కరువయ్యారు

ఛేదనలో కేఎల్ రాహుల్ (95)ఆఖరి బంతి వరకూ అజేయ పోరాటం చేసినా పంజాబ్‌ను గెలిపించలేకపోయాడు. ఆరంభంలోనే క్రిస్‌గేల్ (1), అశ్విన్ (0) కరుణ్ నాయర్ (3) వికెట్లను చేజార్చుకోవడం ఆ జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసింది. ఒక ఎండ్‌లో కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేసినా.. అతనికి సహకారం అందించేవారు కరువయ్యారు. అక్షదీప్ (9), మనోజ్ తివారి (7), అక్షర్ పటేల్ (9) కీలక సమయంలో ఔటవడంతో చివరికి పంజాబ్ 143/7కే పరిమితమైంది.

Story first published: Wednesday, May 9, 2018, 8:56 [IST]
Other articles published on May 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+