Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దంచి కొట్టిన గేల్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై రాయల్ చాలెంజర్స్ విజయం

Chris Gayle
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అదరగొట్టాడు. కళ్లు చెదిరే సిక్స్‌లు, ఫోర్లతో మెరుపు సెంచరీ సాధించి తమ జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. గేల్‌ (107; 49 బంతుల్లో 10X4, 9X6) కళ్లుచెదిరే సెంచరీ బాదడంతో శుక్రవారం బెంగళూరు 85 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను చిత్తు చేసింది. మొదట 6 వికెట్లకు 205 పరుగులు చేసిన బెంగళూరు పంజాబ్‌ను 120/9కు పరిమితం చేసింది. బెంగళూరుకిది వరుసగా నాలుగో విజయం. గేల్‌కే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

గేల్‌ బాదుడుతో అప్పటికే మానసికంగా ఓడిన పంజాబ్‌ లక్ష్యఛేదనలో కనీస పోరాటం కూడా చేయలేదు. తొలి బంతికే కెప్టెన్‌ గిల్‌క్రిస్ట్‌ (0) రనౌటై వెనుదిరిగాడు. పరుగుల వేటలో సెంచరీ కొట్టిన గేల్‌ వికెట్ల వేటలోనూ చెలరేగిపోవడంతో పంజాబ్‌ పేకమేడను తలపించింది. శ్రీనాథ్‌ అరవింద్‌తో కలిసి అతడు పంజాబ్‌ను కోలుకోకుండా చేశాడు. నాయర్‌ (1), షాన్‌ మార్ష్‌ (4), మెక్‌లారెన్‌ (28), హారిస్‌ (17)లను అరవింద్‌ఔట్‌ చేయగా వాల్తాటి (21; 16 బంతుల్లో 4X4), దినేశ్‌ కార్తీక్‌ (20; 15 బంతుల్లో 3X4), చావ్లా (5)లను గేల్‌ వెనక్కిపంపాడు. మరింత త్వరగా బెంగళూరు గెలిచేదే. మెక్‌లారెన్‌, హారిస్‌, ప్రవీణ్‌ (15 నాటౌట్‌) విజయాన్ని ఆలస్యం చేశారు.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ చేసిన గిల్‌క్రిస్ట్‌కు గేల్ చుక్కలు చూపించాడు. తొలి 3 ఓవర్లు గేల్‌ ఆచితూచి ఆడాడు. తన నిర్ణయం సరైందేనని గిల్‌క్రిస్ట్‌ అప్పటివరకు భావించివుండొచ్చు. కానీ ఆ కొద్ది సమయాన్ని పిచ్‌పై ఓ అంచనాకు వచ్చేందుకు ఉపయోగించుకున్నాడని, అతడికి కాసేపటికే అర్థమయ్యుంటుంది. నాలుగో ఓవర్లో గేల్‌ సిక్స్‌ల ఖాతా తెరిచాడు. హారిస్‌ వేసిన ఆ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. దిల్షాన్‌ (16; 9 బంతుల్లో 4X4) కూడా రెండు ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్లో మొత్తం 21 పరుగులొచ్చాయి. ఆ తర్వాతి ఓవర్లోనే దిల్షాన్‌ ఔటయ్యాడు. మెక్‌లారెన్‌ బౌలింగ్‌లో ప్రవీణ్‌కు చిక్కాడు. ఆ ఆనందం పంజాబ్‌కు ఎక్కువసేపు మిగల్లేదు.

గేల్‌ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు సిక్స్‌ కొట్టేందుకు చూశాడు. ప్రవీణ్‌ కుమార్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. తర్వాత అబ్లిస్‌ బౌలింగ్‌ ఒక సిక్స్‌, చావ్లా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లతో చెలరేగడంతో.. బెంగళూరు స్కోరు పది ఓవర్లలోనే 100 దాటింది. 28 బంతుల్లో అర్ధసెంచరీ (5X4, 4X6) సాధించిన గేల్‌ ఆ తర్వాత శతకం పూర్తిచేయడానికి అవసరమైన బంతులు పద్దెనిమిదే. కేవలం 46 బంతుల్లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ టోర్నీలో అతడికిది రెండో సెంచరీ. ఐపీఎల్‌లో రెండు సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌ గేల్‌.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+