గేల్, రసెల్‌లకు చోటు.. విండీస్ ప్రపంచకప్ జట్టు ఇదే!

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుండి మెగా టోర్నీ ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌లో పాల్గొనే అన్ని దేశాలు 15 మందితో కూడిన జట్లను ఈ నెల 23లోగా ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. అయితే వెస్టిండీస్ మాత్రం గడువు ముగిసిన ఒక రోజు తర్వాత జట్టును ప్రకటించింది. బుధవారం వెస్టిండీస్ బోర్డు ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.

గేల్, రసెల్‌లకు చోటు:
విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించారు. విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్.. స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రి రసెల్‌లు జట్టులో చోటు దక్కించుకున్నారు. గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న రసెల్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం గేల్, రసెల్‌లు ఐపీఎల్ సీజన్ -12 భారీగా పరుగులు చేస్తుండడంతో సెలెక్టర్లు వారిని ఎంపిక చేసారు. గాయాల కారణంగా విండీస్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్, అల్జారి జోసెఫ్‌లకు చోటు దక్కలేదు. కిరన్ పోలార్డ్, మార్లొన్ శామ్యూల్స్ లకు కూడా సెలెక్టర్లు షాక్ ఇచ్చారు.

కప్ గెలుస్తాం:
'కీమర్ రోచ్, గాబ్రియల్‌లకు ఇంగ్లాండ్ పిచ్‌లు సరిగ్గా సరిపోవుతాయన్న కారణంగా వారిని ఎంపిక చేసాం. వీరిద్దరూ షెల్డన్ కాట్రెల్‌తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. మా పేస్ బౌలింగ్ చాలా బాగుంది. ఏ పిచ్‌లపైనా అయినా రాణించగలరు. సుదీర్ఘ టోర్నీ కాబట్టి ఫిట్ నెస్ అవసరం. మంచి జట్టును ఎంపిక చేశాం. మా జట్టుకు కప్ గెలవగల సత్తా ఉంది' అని సెలక్షన్ ప్యానెల్ చైర్మన్ రాబర్ట్ తెలిపారు.

వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టు:
జేసన్ హోల్డర్ (కెప్టెన్), క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, డారెన్ బ్రావో, ఆండ్రి రసెల్, షై హోప్, హెట్‌మయర్, కార్లోస్ బ్రాత్‌వైట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆష్లే నర్స్, ఫాబియన్ అలెన్, కీమర్ రోచ్, ఒషానె థామస్, గాబ్రియల్, షెల్డన్ కాట్రెల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications