బెంగళూరు: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పైన 138 పరుగులతో రెండు రోజుల క్రితం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 57 బంతుల్లో 117 పరుగులు చేసి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
దీనిపై బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ స్పందించాడు. తాను బాగా ఆడిన క్రెడిట్ మొత్తం టీందేనని చెప్పాడు. నిజంగా, తాను బాగా విశ్రాంతి తీసుకున్నానని, తన గదిలో టీవీ చూస్తూ, ట్వీట్లు చేస్తూ గడిపానని చెప్పాడు.

గత మ్యాచ్ ఆడకుండా ఈ మ్యాచ్ కోసం బాగా విశ్రాంతి తీసుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఫీల్డ్‌కు వచ్చానని చెప్పాడు. తాను విశ్రాంతి తీసుకొని, పూర్తిగా ప్రిపేర్ అయి వచ్చానని చెప్పాడు. తాను సెంచరీ చేయడం వెనుక తన జట్టు సహకారం ఎంతో ఉందని చెప్పాడు.
కాగా, క్రిస్ గేల్ బుధవారం మరోసారి తన విశ్వరూపం చూపించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం సిక్స్‌లు, ఫోర్లతో 100 కొట్టాడు. అతను 57 బంతుల్లో 117 పరుగులు చేశారు. గేల్‌కు తోడుగా డివిల్లియర్స్ రెచ్చిపోవడంతో పంజాబ్ 138 పరుగుల తేడాతో ప్లేఆఫ్‌కు దూరమైన మొదటి జట్టిగా నిలిచింది.