For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాదేసిన కోహ్లీ, గేల్: సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ముంచేసిన వాన

By Pratap

హైదరాబాద్‌: హైదరాబాదులోని ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాదు జట్టును వర్షం ముంచేసింది. వర్షం కారణంగా పలుమార్లు ఆటంకం కలగడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరు జట్టు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 6 వికెట్ల తేడాతో గెలిచింది.

హెన్రిక్స్‌ (57), వార్నర్‌ (52 నాటౌ ట్‌) రాణించడంతో సన్‌రైజర్స్‌ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. మళ్లీ పలుమార్లు వర్షం రావడం బెంగళూరు లక్ష్యాన్ని 6 ఓవర్లలో 81 పరుగులకు కుదించారు. ఆ తర్వాత బెంగళూరు 5.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాన్ అఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడు.

విరాట్ కోహ్లీ (44 నాటౌట్‌), గేల్‌ (35) రాణించారు. లక్ష్య ఛేదనలో గేల్‌ తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు, సిక్సర్‌ బాదాడు. ఆనక భువీ బౌలింగ్‌లోనూ గేల్‌ 4, 4, 6, 4, 6తో జోరు ప్రదర్శించాడు.

Gayle and Kohli hand RCB thrilling win in rain-hit game

మూడో ఓవర్‌లో గేల్‌, ఏబీ డివిల్లీర్స్‌ (0)ను హెన్రిక్స్‌ అవుట్‌ చేశాడు. ఇక బెంగళూరు విజయానికి చివరి 6 బంతుల్లో 14 రన్స్‌ చేయాల్సి వచ్చింది. కార్తీక్‌ (2) అవుటైనా.. కోహ్లీ వరుసగా రెండు ఫోర్లు, సిక్సర్‌తో జట్టును గెలిపించాడు.

తొలుత బెంగళూరు టాస్‌ గెలిచి ఆతిథ్య సన్‌రైజర్స్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. ఓపెనర్‌ ధావన్‌ (8) అవుటైన తర్వాత వార్నర్‌తో హెన్రిక్స్‌ జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు బాటలు వేశారు. బెంగళూరు ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా హెన్రిక్స్‌కు కలిసొచ్చింది. అవుట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో ఫీల్డర్లు బంతిని ఆపడానికి తీవ్రంగా కష్టపడ్డారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+