ఆరోజు అలా!: బెన్ స్టోక్స్ దాడి ఘటనపై వెలుగులోకి సంచలన విషయం
హైదరాబాద్: ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ రియల్ హీరో అని, అతను ఎలాంటి తప్పు చేయలేదని, అతడు లేకపోయి ఉంటే ఈ రోజు మా పరిస్థితి మరోలా ఉండేదని ఓ గేల్ కపుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. గత నెలలో బిస్ట్రల్‌లో ఓ పబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు స్టోక్స్‌ను అరెస్ట్ చేసి రాత్రంతా జైల్లో ఉంచారు.
విచారణ అనంతరం ఎలాంటి చార్జ్ లేకుండానే బెన్ స్టోక్స్‌ను పోలీసులు విడుదల చేశారు. ఆరోజు రాత్రి నైట్ క్లబ్‌లో బెన్ స్టోక్స్ ఇద్దరు వ్యక్తులపై దాడికి దిగడం, అందుకు సంబంధించిన వీడియో అప్పట్లో హల్ చల్ చేసింది. ఈ వీడియోని సన్ న్యూస్ పేపర్ బయటపెట్టి దానికి 'హిట్ ఫర్ సిక్స్' అనే పేరుని పెట్టింది.

బెన్ స్టోక్స్ పిడిగుద్దులు
ఇందులో ఇద్దరు వ్యక్తులపై బెన్ స్టోక్స్ పిడిగుద్దులు కురిపిస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఘటనను నిర్ధారించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యాషెస్ సిరిస్ నుంచి బెన్ స్టోక్స్‌ని తప్పించింది. ప్రస్తుతం ఈ కేసు విషయమై బెన్ స్టోక్స్ పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు సాక్ష్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

తమను రక్షించడానికే బెన్ స్టోక్స్ ఆరోజు అలా
ఈ నేపథ్యంలో కై బారీ-ఓ కొన్నెల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆరోజు రాత్రి తమను రక్షించడానికే బెన్ స్టోక్స్ ఆ దాడికి పాల్పడినట్లు వారు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరూ ‘ద సన్' అనే వార్తా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

డ్రింక్స్ కోసం ఆరోజు రాత్రి నైట్‌క్లబ్‌కు వచ్చిన బెన్ స్టోక్స్
'ఆసుపత్రి ట్రీట్‌మెంట్ కోసమని మేమిద్దరం బ్రిస్టల్ వెళ్లాం. బెన్ స్టోక్స్ తన స్నేహితుడు హేల్స్‌తో కలిసి డ్రింక్స్ కోసం ఆరోజు రాత్రి నైట్‌క్లబ్‌కు వచ్చాడు. అదే సమయంలో మేమిద్దరం అక్కడే ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో కైతో కలిసి నేను డ్యాన్స్ చేస్తుంటే కొందరు మా ఇద్దర్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా మాట్లాడారు' అని తెలిపారు.

దాడి చేస్తారేమోనని భయపడ్డాం
'ఈ సమయంలో వారు మాపై దాడి చేస్తారేమోనని కూడా భయపడ్డాం. మాకు ఏం మాట్లాడాలో అర్థంకాక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. ప్రమాదంలో ఉన్నట్లు మాత్రం అర్థమైంది. అప్పుడే బెన్ స్టోక్స్ కల్పించుకున్నాడు. వారిని ప్రశ్నించాడు. ఒకవేళ స్టోక్స్ కలగజేసుకోకపోయి ఉంటే ఆరోజు ఏం జరిగేదో చెప్పలేను' అని తెలిపారు.

బెన్ స్టోక్స్ రియల్ హీరో
అంతేకాదు బెన్ స్టోక్స్ రియల్ హీరో అని, మాకు ఆరోజు ఎంతో సాయం చేశాడని వారు తెలిపారు. ‘దయచేసి బెన్ స్టోక్స్‌ను యాషెస్ సిరీస్‌లో ఆడనివ్వండి. ఆ రోజు జరిగిన ఘటనలో అతని తప్పిదం ఏమీ లేదు. అతను కేవలం మాకు సాయం చేసేందుకే ప్రయత్నించాడు' అని కై అన్నారు. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు శనివారం ఆసీస్ బయల్దేరి వెళ్లింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications